టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసెస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న తారక్.. ప్రస్తుతం వార్ 2 షూట్లో సందడి చేస్తున్నాడు. మరోపక్క జనవరి నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ పై.. సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడట. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను సితార బ్యానర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రూపొందించనుందని టాక్. ప్రస్తుతం సితారా ఎంటర్టైన్మెంట్స్ మంచి ఫామ్ లో ఉంది. తెలుగులో లీడ్ బ్యానర్ గా ఎదిగి.. మంచి లాభాలను దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి మినిమం 4, 5 సినిమాలు ప్లాన్ చేసి ఈ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.
తెలుగులో పవన్, బాలయ్య, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో తారక్‌ను రంగంలోకి దించనున్నారని మీడియా వర్గాలనుంచి టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాకు జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడట. తారక్‌ను కలిసిన నెల్సన్.. ఓ కథను వినిపించాడని ఆ స్టోరీ నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. పూర్తిస్థాయి స్రీప్పు సిద్ధం చేయమని నెల్సన్‌కు తారక్ వివరించాడట. ఈ పాన్ ఇండియా సినిమాను తరికెక్కించడానికి ఓ పక్క సితార ఎంటర్టైన్మెంట్.. మరో పక్కన హెంబాలే ఫిలిమ్స్ పోటీ పడ్డాయని.. చివరకు ఎన్టీఆర్ సితార సంస్థ వైపే మగ్గు చూపినట్లు సమాచారం.
సూర్యదేవర రాధాకృష్ణ నాగవంశీ బ్యానర్లో ఎన్టీఆర్ గతంలో అరవింద సమేత నటించిన సంగతి తెలిసిందే. సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తారక్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తి కాగానే నెల్సన్ సినిమాను చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ప్రస్తుతం వార్2 అలాగే ప్రశాంత్ రెండు సినిమాల పనులను బిజీగా ఉన్న తారక్.. వాటిలో ఒక్క సినిమా షూట్ పూర్తయినా.. వెంటనే నెల్సన్ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నాడట. ఇక ఈ మూవీ ఫన్ అండ్ యాక్షన్ కలిపినా భారీ పాన్ ఇండియన్ కంటెంట్‌తో రూపొందనుందని.. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని విధంగా తారక్‌ను సరికొత్త పంథాలో ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా చూపించనున్నారని టాక్.