సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సహజనటతో తమకంటే ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఓ పాత్రలో నటిస్తే ఆ పాత్ర వాళ్ళు తప్ప మరెవరు చేసిన ఊహించుకోలేం అనేంతగా ప్రత్యేకంగా పేరు సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ఈ నటుడు కూడా ఒకరు. విలక్షణ నటనతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈయన.. చిన్న చిన్న సినిమాలతో తన కెరీర్‌ను మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదగాడు.
దేశవ్యాప్తంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన విలక్షణ పాత్రలో నటిస్తున్నాడు. ఇంతకీ ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. తను ఓ సినిమాలో నటించాడు అంటే.. ఆయన పాత్ర ఆడియన్స్ లో అలా గుర్తుండిపోతుంది. హీరోగా, విలన్ గానే కాదు.. ఎలాంటి పాత్రలో నేను తన సత్తా చాటుకోగల గొప్ప నటుడిగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల్లోనూ మెప్పించాడు. తెలుగులో కూడా మంచి ఇమేజ్ను దక్కించుకున్నాడు. ఇంతకీ ఎవరో చెప్పలేదు కదా.. తనే నటుడు ఫాహద్ ఫాజిల్.
మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన ఈయన.. మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా మారాడు. ఇక పుష్పాతో విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు పుష్ప 2లోను విలన్ గా కనిపించనున్నాడు. మొదటి పార్ట్ లో ఆయన పాత్ర నడివి చాలా తక్కువ అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫాహద్.. పుష్ప 2లో మరింత బలంగా కనిపించనున్నారని ఇటీవల రిలీజైన ట్రైలర్లో అర్థమవుతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయ్యి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.