బాలయ్య బాబాయ్‌కు పద్మభూషణ్.. తారక్‌కు పద్మశ్రీ..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ త్వరలోనే పద్మభూషణ అవార్డు అందుకోనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్లుగా నిలిచిన బాలయ్య, చిరు, నాగ్‌, వెంకీలలో ఇప్పటికే మెగాస్టార్‌ పద్మభూషణ్‌ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత టాలీవుడ్‌లో పద్మభూష‌ణ్‌కు బాలయ్య మాత్ర‌మే అర్హులంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమే నెటింట మరోక‌టి వైరల్ గా మారుతుంది. అయితే ఈసారి సీనియర్ హీరోలు కాదు.. విచిత్రంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే యంగ్ హీరోల్లో పద్మా అవార్డు దక్కించుకున్న తొలి హీరోగా మాన్ ఆఫ్ మాసేస్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం.

Nandamuri Balakrishna turns 64: 11 siblings to philanthropic work,  lesser-known facts about the NBK109 actor - Hindustan Times

మరి ఈ బాబాయి, అబ్బాయి ఇద్దరికీ.. పద్మ అవార్డులు వరిస్తాయో.. లేదో.. వేచి చూడాలి. ఇప్పటికే నట‌సింహం బాలయ్య‌కు పద్మభూషణ్ అవార్డు రావడం కన్ఫర్మ్ అయిపోయిందంటూ.. అంతేకాదు ఎన్టీఆర్‌కు పద్మశ్రీ వచ్చేలా ఉందంటూ ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే వీరి పంట పండినట్టే. ఇక చిరంజీవి కంటే చిన్నవాడే అయినా టాలీవుడ్ నాలుగు స్తంభాలలో మరో స్ట్రాంగ్ పిల్లర్‌గా బాలయ్య మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అంతే కాదు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలోని నటించి ప్రేక్షకులను మెప్పించాడు. బాలయ్యకి సత్కారం అందడానికి ఇదే సరైన సమయం అంటూ కామెంట్లో వినిపిస్తున్నాయి.

Jr NTR Birthday: Here's Why RRR Star is Called the 'Man Of Masses' - News18

ఇక ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాడు. కేజీఎఫ్‌తో య‌ష్‌, బాహుబలి, సలార్, కల్కితో.. ప్రభాస్, ఆర్ఆర్ఆర్‌తో చర‌ణ్, పుష్ప‌తో బ‌న్ని పాన్ ఇండియా లెవెల్‌లో న‌టించి స‌క్స‌స్ చూసిన వాళ్లే. అయినా తారక్‌కి.. వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసమే దానికి అర్హత తెచ్చి పెట్టిందని కెరీర్‌లో అతి చిన్న వయసులోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సక్సెస్ సాధించి టీనేజ్ లోనే ఆది, సింహాద్రి లతో బ్లాక్ బస్టర్ అందుకునే రికార్డు క్రియేట్ చేసిన తారక్ నేచురల్ ఆర్టిస్ట్ గాని కాదు మాస్ ఇమేజ్ తోను దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తారక్ కూడా పద్మశ్రీ అర్హుడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తారక్ పద్మశ్రీ అవార్డును అందుకున్న తొలి ఏం హీరోగా రికార్డ్ సృష్టిస్తాడో లేదో వేసి చూడాలి.