టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా అక్కినేని యువ హీరో నాగచైతన్య, శోభితల పెళ్లి వార్తలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైతన్య మాజీ భార్య సమంతకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. గత కొంతకాలంగా మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో తాజాగా సిటాడెల్.. హనీ బన్నీ.. సిరీస్ తో ఆడియన్స్‌ను పలకరించింది.
ఇక ఈ సినీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఆమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. అలా ఓ సరదా చిట్ చాట్ లో వరుణ్ ధావన్ తో కలిసి పాల్గొన్న సమంత.. స్పైసి రాపిడ్ ఫెయిర్ లో ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఇష్టమైతే సమాధానం చెప్పచ్చు.. లేదా మిర్చి తినొచ్చు అని చెప్పగా ఓకే చేసింది. అయితే ఇందులో భాగంగానే వరుణ్ ప్రశ్నిస్తూ.. అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో ఖర్చు చేసింది దేనికోసం అని అడిగాడు.
దానికి సమంతా రియాక్ట్ అవుతూ.. నా మాజీకి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఎంత ధర ఉంటుంది అని అడగ్గా.. కాస్త ఎక్కువే.. ఇక కొనసాగిద్దాం అంటూ ఆ కాన్వర్జేషన్ ని ముగించింది. అయితే ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఎవరి గురించి ఇలా మాట్లాడుతుంది.. తన మాజీ అంటే నాగచైతన్య గురించే ఇలాంటి కామెంట్స్ చేస్తుందా.. లేదా మరెవరినైనా ఉద్దేశించి మాట్లాడిందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ఎంతో మంది ప్రశంసలు అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో స్ట్రీమ్ అవుతుండగా.. 150 దేశాల్లో టాప్ లో ట్రెండ్ అవుతుంది.