సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఓ పోజిషన్ వచ్చిందంటే చాలు.. మీడియాతో పాటు సాధారణ ప్రజల కన్ను కూడా వారిపైనే ఉంటుంది. వారి ప్రైవేట్ విషయాలు, వారి లగ్జరీ లైఫ్, వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వారి పైన ఫోకస్ చేస్తారు. అలా తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వారిలో టాలీవుడ్ మహానటి.. కీర్తి సురేష్ కూడా ఒకటి. ఆమె పెళ్లి వార్త నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. తాజాగా కీర్తి సురేష్ తండ్రి సురేష్ దీనిపై అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చారు.
కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని.. 15 సంవత్సరాల నుంచి తనకు ఎంతో క్లోజ్ గా ఉంటున్న తన ఫ్రెండ్, బిజినెస్ మ్యాన్ ఆంటోనీ తట్టిల్‌ని వివాహం చేసుకోబోతుందని.. గోవాలో వీరిద్దరి పెళ్లి జరగనుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు. డిసెంబర్ 11, 12 తేదీలలో వీళ్ళ వివాహం జరుగుతుందంటూ వెల్లడించాడు. దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆంటోని తట్టిల్ దుబాయ్ లోనే ఓ పెద్ద బిజినెస్ మాన్ అని.. వేలకోట్ల ఆస్తిని సంపాదించిన అంటోని, కీర్తి సురేష్ చిన్నప్పుడు ఇద్దరు కలిసే చదువుకున్నారని తెలుస్తుంది.
అంతేకాదు అంత పెద్ద కుటుంబానికి కీర్తి సురేష్ కోడలుగా కానున్న క్రమంలో.. ఆమె కట్నం ఎంత ఇస్తుందని అంశంపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే అంటోనీ.. కీర్తి సురేష్ నుంచి ఒక్క రూపాయి కూడా కట్నం ఆశించలేదట. కానీ ఆమె తల్లిదండ్రులే ఆమెకు అప్పజెప్పాల్సిన ఆస్తులు, బంగారం, తన ప్రాపర్టీస్ అన్ని తనకు అప్పజెప్పాలి కనుక.. కూతురుకు ఇస్తున్నారని తెలుస్తుంది. కీర్తి సురేష్ కు హైదరాబాదులో ఉన్న ప్రాపర్టీస్ తో పాటు.. చెన్నైలో ఉన్న రెండు విల్లాలను.. అలాగే ఆమె కోసం కొన్ని దాచిన బంగారాన్ని, వాళ్ళ ఆస్తుల్లో సగ భాగాన్ని కూడా ఆమె పేరున రాసి ఇచ్చేసారట. దీంతో ప్రస్తుతం మహానటి కట్నం మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.