కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కూలి సినిమాల్లో హీరోగా నటిస్తున్న రజిని.. ఈ సినిమాలో ఓ డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన స్టైల్‌తో కుర్ర కారును ఆకట్టుకుంటున్న రజిని.. లోకేష్‌కనగరాజన్ డైరెక్షన్‌లో కూలి సినిమాలో నటిస్తుండడం విశేషం.
లోకేష్ కనగరాజన్ డైరెక్షన్ అంటే ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాల్లో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తున్నాడన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో.. నాగార్జున సినిమాలో స్టైలిష్ విలన్‌గా కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. అంతేకాదు రజనీకాంత్‌ను ఢీ కొట్టి పవర్ఫుల్ విలనిజాన్ని కూడా చూపించనున్నాడట. ఇక లోకేష్ కనగరాజన్ డైరెక్షన్‌లో విలన్ గా అంటే.. విక్రమ్ సినిమాలో సూర్య.. రోలెక్స్ పాత్రే గుర్తుంటుంది. ఇదే ఇమేజ్ నాగార్జున కూడా వస్తుందని ఉద్దేశంతోనే ఆయన విలన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఇదిలా ఉంటే.. రజనీకాంత్ కూలి సినిమాలో నాగార్జున విలన్ గా ఉండడమే కాదు.. రజిని నెక్స్ట్ సినిమాలో కూడా ఓ తెలుగు హీరో విలన్‌గా చేయనున్నాడట. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ సీక్వెల్.. జైలర్ 2 తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ఒకప్పటి తెలుగు స్టార్ హీరో రాజశేఖర్ లేదా శ్రీకాంత్‌లను విలన్‌లుగా తీసుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నాడట. ఎందుకంటే తెలుగు హీరోలతో విలనిజం చేస్తే.. తమిళ్, తెలుగు రెండు ఇండస్ట్రీలలో కూడా మంచి మార్కెట్ వస్తుందని ఉద్దేశంతో అయినా ఇలాంటి ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు తమిళ్లో విలన్స్ అందరితోనూ నటించిన రజిని వాళ్ళతో మరోసారి చేయడం రొటీన్ గా ఫీల్ అవుతున్నారట. కొత్తదనం కోసమే తెలుగు హీరోలను సెలెక్ట్ చేసుకుంటున్నారు సమాచారం.