ఇటీవల సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలుగా మారిన ఎంతోమంది నటీ,నటుల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీస్ కూడా తమ చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫుల్ బిజీ బిజీగా గడిపిన ముద్దుగుమ్మ చిన్నపటి ఫోటో తెగ వైరల్ గా మారుతుంది. అంతేకాదు ఈమె లక్షల మంది కుర్ర కారు డ్రీమ్ గర్ల్ కూడా.
ఇంతకీ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. 2009లో గిల్లి సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. కెరటం మూవీతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మొదటి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దాదాపు టాలీవుడ్ హీరోలు అందరి సరసన నటించింది. ఇక మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వరుస ఫ్లాప్‌లు ఎదురవడంతో బాలీవుడ్‌కు మక్కాం మార్చేసింది.
అక్కడ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ.. నటిస్తున్న క్రమంలోనే బాలీవుడ్ యాక్టర్, కమ్ ప్రొడ్యూసర్.. జాకీ భగ్నానీని ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంద. తాజాగా తన చిన్ననాటి ఫొటోస్ ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున రకుల్.. నా పెళ్లి రోజు కానుకగా నా పేరెంట్స్ నాకు ఇచ్చిన బహుమతి ఇది. నా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్న వీడియో. ఇది నాకు ఎంతో ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రతి ఒక్కరూ మీలో చిన్నపిల్లలను ఎప్పటికీ మర్చిపోకండి.. ఆ జ్ఞాపకాలు, నవ్వులు, ఆట, పాట ఎప్పటికీ కోల్పోకండి.. హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ చిన్ననాటి ఫొటోస్ తో పాటు పోస్ట్ వైరల్ గా మారుతుంది.