రూ.80 కోట్లు ఖర్చు.. రెండేళ్ల షూట్ తర్వాత బాహుబలి ఫ్రీక్వెల్ ఆగిపోవడానికి కారణం అదేనా..

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తరకెక్కి తెలుగు సినిమా ఖ్యాలిని రెట్టింపు చేసిన సినిమా బాహుబలి. 2 పార్ట్‌లుగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగాను ఎవరు గ్రీన్ వసూళ‌ను సాధించి నెంబర్ 1గా ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ ని పురస్కరిస్తూ బాహుబలి.. ప్రీక్వెల్‌ రూపొందించే పనిలో బిజీ అయిన‌ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ అనే టైటిల్ తో ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ నటుడు బిజయ్ ఆనంద్ ఈ ప్రాజెక్టు పై ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. బాహుబలి3 అనౌన్స్ చేసిన తర్వాత మెయిల్ లీడ్ కోసం తనను సెలెక్ట్ చేసుకున్నారంటూ వివరించాడు.

మొదట్లో తన సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ప్రాజెక్ట్‌కు నో చెప్పేసానని.. అయినా తనను ఒప్పించి ప్రాజెక్టులో తీసుకున్నారంటూ వెల్లడించాడు. మొత్తానికి రెండు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ప్రాజెక్టును షూట్ చేశారని.. దాదాపు 80 కోట్ల రూపాయల వరకు దీనికి ఖర్చయిందని.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేకుండా క్యాన్సిల్ చేసేసారు అంటూ బిజయ్ ఆనంద్ వెల్లడించాడు. తను రెండు సంవత్సరాలు పాటు సినిమా కోసం కష్టపడ్డానని.. చాలా సినిమా అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశానని.. ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోవడం ఎంతో బాధ కల్పిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బిజయ్‌ ఆనంద్‌ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి.

వాళ్ళు పెట్టే బడ్జెట్‌కి.. ప్రాజెక్ట్ వర్క్ పూర్తి కాదనే ఉద్దేశంతో క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. అయితే ఆనంద్ నీలకంటన్ రాసిన.. ది రేజ్‌ ఆఫ్ శివగామి, క్వీన్ ఆఫ్ మాహిష్మతి నవల ఆధారంగా ఈ ప్రాజెక్టును రూపొందించాల‌నుకున్నారు. అలాంటి ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఏదేమైనా బాహుబలి సినిమాకు వచ్చిన క్రేజ్ వాడుకొని భారీగా డబ్బులు సంపాదించాలని నెట్‌ఫ్లిక్ సంస్థ చేసిన ప్రయత్నానికి ఎదురు దెబ్బ మిగిలింది. ఇక ప్రాజెక్టులో కంటిన్యూ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారా.. లేదా పూర్తిగా ఆపేస్తారా తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.