టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప తో భారీ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత బన్నీ పుష్ప 2తో ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం ఖాయం అంటూ మేకర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఐకాన్ స్టార్ సినిమాల్లో నటించాలని ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కూడా ఆరాటపడుతున్నారు. అయితే గతంలో అల్లు అర్జున్ సరసన పుష్పలో నటించే ఛాన్స్ వచ్చిన ఓ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు సాయి పల్లవి. సౌత్ ఇండస్ట్రీ నేచురల్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ గాను పాపులారిటీ దక్కించుకుంది.
ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్స్ అంరికీ భిన్నంగా.. డీ గ్లామరస్ పాత్రలో ట్రెడిషనల్ లుక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మరో పక్క నార్త్ లోను అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే.. ఎలాంటి స్టార్ హీరో సినిమాలైనా.. తనకు ఇష్టం లేకుంటే ఆ సినిమాలను రిజెక్ట్ చేసేస్తుంది. అలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలను సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. మొదట పుష్ప కోసం బన్నీ సరసన శ్రీవల్లి పాత్రలో సాయి పల్లవి అనుకున్నారట సుకుమార్. అయితే సాయి పల్లవి స్టోరీని రిజెక్ట్ చేసింది. కథ నచ్చిన సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్పోజింగ్‌కు తావుందని కారణాలతో పుష్ప సినిమాను రిజెక్ట్ చేసిందట.