ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. ఈ ఏడది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ గ్రాండ్ లెవెల్లో లెవెల్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. కొద్ది గంటల క్రితం ఈ మూవీ ఐటెం సాంగ్.. కిసిక్ సాంగ్ లంచ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్‌గా జరిపారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పని ఇతరులకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు.. ఏం మాట్లాడతారని.. ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దానికి తగ్గట్టుగానే దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ స్మూత్‌గా మేకర్స్‌కు సెటైరికల్ పంచ్ వేశాడు. చెప్పి.. చెప్పనట్లుగా.. ఫ్యాన్స్ కి మ్యాటర్ అంతా రివిల్ చేశాడు. తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. ఏదైనా మనం అడిగి తీసుకోవాలని.. అడగకుండా ఎవరు ఇవ్వరంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా, తెరపై దక్కాల్సిన క్రెడిట్ అయినా అడగాల్సిందే అంటూ దేవిశ్రీప్రసాద్ కామెంట్స్ చేశారు.
దీని వెనక ఎన్నో అర్థాలు ఉన్నాయని.. పలానా టైంకి బిజీఏం కావాలని తనను మేకర్స్ అడగకపోవడం వల్లే తను బిజీ ఏం ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని.. డీఎస్పీ తన భావన వినిపించాడని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు సమయానికి పేమెంట్ ఇవ్వకుండా డిఎస్పి ని చాలా ఇబ్బంది పెట్టారని.. చెప్పకనే చెప్పాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం డిఎస్పీ చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్ గా మారాయి.