టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్.. ఈ ఎడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో తారస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంటూ.. ప్రతి ప్రమోషన్‌ను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఇక తాజాగా.. ఈ మూవీ నుంచి లిరికల్ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కిస్ కిసిక్కిను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే పుష్ప పార్ట్ 1లో ఉ అంటావా మామ.. ఉఊ అంటావా.. పాట చార్జ్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ని షేక్ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులో పుష్ప 2 ఐటమ్ సాంగ్ పై మరిన్ని అంచనాలను పెంచేసింది. అది దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీప్రసాద్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ట్యూన్ అందించినట్లు తెలుస్తుంది. దానికి తగ్గటు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ కూడా ఇన్స్టెంట్ చార్జ్ బస్టర్ అనే ఫీలింగ్ అభిమానుల్లో కలుగుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరిలోనూ తమ డ్యాన్స్ తో అదరగొడుతున్న వారిలో శ్రీలీల పేరు మొదట ఇనిపిస్తుంది.. ఈ క్రమంలోనే యూనిట్ శ్రీ లీలపై ఇంట్రెస్ట్ చూపించారట.
ఇక ఈ సినిమా కోసం అమ్మడు ఫస్ట్ టైం ఐటెం గర్ల్ గా మారింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలోనూ.. మరో పక్క నార్త్‌లో కూడా ఈ సినిమాపై మంచి బస్ ఏర్పడింది. ఇక ఈ పాటకు శ్రీలీల ఏకంగా కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుందంటూ సమాచారం. ఇక ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టే బన్నీతో కలిసి శ్రీలీల దుమ్ము దులిపేసింది. ఇద్దరు పోటీపడి డాన్స్ వేసి మాస్ స్టెప్‌లతో దుమ్ము దులిపారు. అయితే సమంత ఊ అంటావా ఉఊ అంటావా సాంగ్ తో పోలిస్తే మాత్రం కిసిక్ సాంగ్ కాస్త తక్కువ రెస్పాన్స్ ను అందుకుంటుంది.
సామ్ రేంజ్ లో క్ష లీలా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయలేక పోయిందంటూ టాక్ నడుస్తుంది. ఊ అంటావా.. ఉఊ అంటావా.. అంటూ సమంత తన అందచందాలతో, డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ తోనూ ప్రేక్షకులను మెప్పించింది. ఇక శ్రీ లీలా సాంగ్‌కు ఊహించిన రేంజ్‌లో రెస్పాన్స్ రాలేదు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుకుంటుందా.. లేదా.. మాస్ జాతర ఏ రేంజ్ లో ఉండబోతుందని సందేహాలు ఆడియన్స్ లో మొదలయ్యాయి. అయితే శ్రీల ఫ్యాన్స్ మాత్రం థియేటర్స్ దగ్గర కచ్చితంగా కిసిక్ బ్లాక్ బస్టర్ పక్కా అంటూ ఉ అంటావా మామ సాంగ్ మించిపోయే రేంజ్‌లో కిసిక్ సక్సెస్ అందుకుంటుందంటూ.. దేశాన్ని ఓ ఊపు ఊపేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.