టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహేష్.. చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఇక ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. దానికి కారణం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన మేకవర్ కోసం సిద్ధమవుతున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్ కు సంబంధించిన లేటెస్ట్ లుక్స్ నెటింట తెగ వైరల్‌గా మారింది.
అంతేకాదు ఈ సినిమా కోసం జర్మనీ వెళ్లి మరి సూపర్ స్టార్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక మహేష్ తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే పలు కథలు రిజక్ట్ చేయడం.. ఆ కథల్లో మరో హీరో నటించి సక్సెస్ అందుకుని సూపర్ స్టార్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అలా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన మూడు కథలలో.. ఒకే హీరో నటించి ఏకంగా పాన్ ఇండియన్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. బన్నీ నుంచి చివరిగా తెరకెక్కిన పుష్పా సినిమా.. ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై భారీ కలెక్షన్లని కొల్లగొట్టింది.
ఇక మొదట ఈ సినిమాలో మహేష్‌కు ఆఫర్ వచ్చిందట. అయితే ఈ సినిమాల్లో బన్నీలా మేకోవర్ అవ్వాల్సి వస్తుందని.. డీ గ్లామర్ పాత్రలో అభిమానులు నన్ను చూడరేమో అనే ఉద్దేశంతో సినిమాను రిజెక్ట్ చేసాడట. తర్వాత అల్లు అర్జున్ దగ్గరకు కథ పంపించారు. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 లో ఆయన నటిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ నటించిన మరో మూవీ అలవైకుంఠపురంకు కూడా మొదట మహేష్ బాబుని అనుకున్నారట. అప్పట్లో మహేష్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో.. ఈ సినిమాకు నో చెప్పేసాడు. ఇక ఈ సినిమా కూడా ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచి బన్నీకి మంచి ఇమేజ్ క్రియేట్ చేసింది. ఇక మహేష్ రిజెక్ట్ చేసిన మరో సినిమా రుద్రమదేవి.
గుణశేఖర్ డైరెక్షన్ బచ్చిన ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. మొదటి ఈ పాత్ర కోసం మహేష్ ని అప్రోచ్ కాగా.. మహేష్ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను డైరెక్టర్ అప్రోచ్ కావడం.. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సినిమాలో నటించి మంచి ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్.. రాజమౌళి డైరెక్షన్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. సాధారణంగా మహేష్ కు గడ్డం పెంచడం, షట్ విప్పేసి ఖండాలు చూపించడం లాంటివి ఇష్టం ఉండవు. కానీ.. జక్కన్న హ్యాండోవర్‌లోకి వెళ్లిన తర్వాత.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆయన చెప్పినట్లు వినాల్సిందే. ఈ క్రమంలోనే మహేష్ జుట్టు, గడ్డం పెంచి నయా లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.