పవన్ ‘ ఓజి ‘ సెట్స్ లోకి ప్రకాష్ రాజు ఎంట్రీ.. సుజిత్ పై ఫైర్ అయిన పవన్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్యన ఏ స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డు విషయంలో సీరియస్ అయినా పవన్ కళ్యాణ్ దానిపై రియాక్ట్ అవుతూ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. సనాతన ధర్మం పరిరక్షణ బోర్డ్ ని ఏర్పాటు చేసి నిపుణుల‌ను కమిటీ మెంబర్స్‌గా పెట్టి ఆ బోర్డుకి నిధులు కేటాయించాలని మాట్లాడారు. దానికి ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మొదటి నుంచే ప్రకాష్ రాజ్ కు బిజెపి పార్టీ అంటే అసలు నచ్చదు. ఈ క్రమంలోనే బిజెపితో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన పవన్ కళ్యాణ్ పై మొదటినుంచి సైలెంట్ సెటైర్‌లు వేస్తూ వచ్చాడు.

Versatile actor Prakash Raj joins the sets of PK's 'OG' - Andhrawatch.com

కానీ.. పవన్ వాటిని పట్టించుకోలేదు. రాజకీయపరంగా ఆయన నన్ను ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. కానీ.. నటుడుగా ఆయన దేశం గర్వించదగ్గ వ్యక్తి ఆయన అంటే నాకు చాలా గౌరవం అంటూ వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వివరించాడు. అయితే ఎప్పుడు ప్రకాష్ రాజ్ పై సీరియస్ కానీ పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేయడంపై సీరియస్ అయ్యాడు. అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ప్రకాష్ రాజ్‌.. పవన్ కళ్యాణ్‌ని ఏదో రకంగా విమర్శలు చేస్తూ ఉన్నాడు. తాజాగా అయితే ఆయన హద్దులు దాటి ఓ తమిళ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సిగ్గులేనివాడు అంటూ వివాదాస్పద కామెంట్లు చేసి కోపం తెప్పించాడు. ఇక ఒకే ఇండస్ట్రీలో పని చేస్తున్న క్రమంలో రేపు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సి వస్తుంది. ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటి చెత్త కామెంట్స్ ప్రకాష్ చేయడం పై అభిమానులు మండిపడ్డారు.

OG (2025) - IMDb

కాగా.. ప్రస్తుతం ప్రకాష్ రాజ్‌, పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ మూవీ ఓజీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ను డైరెక్టర్ సుజిత్ ప్రారంభించగా.. ఈ స్కెడ్యూల్‌లో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా స్కెడ్యూల్లో పాల్గొననున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ తో కాంబినేషన్ సీన్స్‌.. పవన్ కళ్యాణ్ రాబోయే రెండు రోజుల్లో తీయవలసి ఉందని డైరెక్టర్ సుజిత్ పవన్ కు వివరించాడట. ఆయన కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రేపు సెట్స్‌లోకి పవన్ అడుగుపెట్టిన తర్వాత వీరిద్దరి మధ్యన ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో.. దర్శక, నిర్మాతలు వీళ్లిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో వేచి చూడాలి. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో భారీ యాక్షన్స్ సన్నివేశాలు కూడా రూపొందించనున్నారట. మరోపక్క పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూట్లో కూడా పాల్గొంటున్నాడు.