నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన సినిమాల్లో హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతునే మరోపక్క రాజకీయాలను హ్యాట్రిక్ సక్సెస్ అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నుంచి తర్వాత రాబోతున్న సినిమాలపై ప్రేక్షకులో అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక త్వరలోనే బాలయ్య నుంచి తన 1009వ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలయ్య ఈ మూవీ తర్వాత తన నెక్స్ట్ మూవీ పై ఫోకస్ పెట్టాడు.
నందమూరి అభిమానులంతా ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న బాలయ్య, బోయపాటి కాంబో సెట్స్ పైకి రానుంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగో సినిమాగా అఖండ తాండవం రూపొందుతుంది. ఇక ఇప్పటికే వీరిద్దరు కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో అఖండ సిక్వెల్‌గా రానున్న అఖండ తాండవాన్ని.. పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూట్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా అఖండ తాండవం టైటిల్ తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
అయితే షూట్ ప్రారంభానికి బాలకృష్ణ బోయపాటితో పాటు ప్రొడ్యూసర్లు అలాగే కూతురు బ్రాహ్మణి, తేజస్విని కూడా హాజరై సందడి చేశారు. బ్రాహ్మణి క్లాప్ కొట్టి బాలయ్య సినిమా ప్రారంభించారు. ఈక్రమంలో బాలయ్యకు సంబంధించి ఓ న్యూస్ నెటింట హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య.. కూతురుముందే.. హీరోయిన్‌కు ముద్దు పెట్టడంటూ న్యూస్ సంచలనంగా మారింది. అయితే సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కలిసి నటించే హీరో, హీరోయిన్ ఎదురుపడినప్పుడు హాగ్ చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే బాలయ్య కూడా ప్రగ్య జైశ్వాల్‌ను హగ్ చేసుకుని.. కిస్ ఇస్తున్నట్లుగా దగ్గరకు జరిగారు. ఈ వీడియో నెటింట వైరల్ గా మారడంతో.. యాంటీ ఫ్యాన్స్ బాలయ్య పై నెగెటీవ్ కామెంట్స్ చేస్తూ తెగ ట్రాల్స్ చేస్తున్నారు.