నందమూరి నటసింహ బాలకృష్ణ.. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన నటవరసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లోనూ హ్యాట్రిక్ సక్సెస్‌లతో దూసుకుపోతున్న బాలయ్య నుంచి.. ఇప్పటివరకు 108 సినిమాలు తెరకెక్కాయి. ఇక ప్రస్తుతం తన 109వ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు తన 110 సినిమాకోసం సిద్ధమవుతున్నాడు బాలయ్య. బోయపాటి డెరెక్షన్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకోవడంతో.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాదు బాలయ్య నుంచి వచ్చిన అఖండ ఇండస్ట్రియల్ హిట్ గా నిలచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను మేకర్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో బాలయ్య ‘ అఖండ తాండవం ‘ రెమ్యునరేషన్ సంబంధించిన న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. 100కి పైగా సినిమాల్లో బాలయ్య నటించిన.. ఏనాడు నిర్మాతల దగ్గర రెమ్యూనరేషన్ కోసం డిమాండ్ చేయడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటినుంచో ఉంది. కాగా ఇటీవల బాలయ్య నటించిన చివరి మూడు సినిమాల్లో వీరసింహారెడ్డికి రూ.14 కోట్లు తీసుకున్నారట. ఈ మూవీ కలెక్షన్ పరంగా ఏకంగా రూ.140 కోట్లు సంపాదించుకుంది.
ఇక భగవంత్ కేసరి సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ రూ.18 కోట్లు తీసుకున్నాడు. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ సకస్స్ అయ్యింది. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య నటించిన ఎన్.బి.కె 109 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు కూడా బాలయ్య రూ.30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే ప్రస్తుతం బాలయ్య బోయపాటి – కాంబోలో వస్తున్న అఖండ తాండవం.. 14 డ్రిల్స్ బ్యానర్ పై రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాలయ్య రూ.50 నుంచి రూ.54 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇదే నిజమైతే బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి సినిమాగా రికార్డ్ సృష్టిస్తుంది.