టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. ఆయన పబ్లిసిటీ, పాపులారిటీ వేరు. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో, టాప్ బ్యూటీలతో నటించి మెప్పించారు. అయితే ఎంతోమంది ముద్దుగుమ్మలతో నటించిన పవన్ కళ్యాణ్‌కు కూడా ఫెవరెట్ హీరోయిన్ ఒకరు ఉన్నారు. అయితే ఆ హీరోయిన్ అంటే కేవలం పవన్ కళ్యాణ్‌కే కాదు.. ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమందికి చాలా ఇష్టం. గౌరవం కూడా.
చాలామంది ఆమెనే తమ ఫేవరెట్ హీరోయిన్ అని చెబుతూ ఉంటారు. అయితే టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్‌కు కూడా.. ఆ హీరోయిన్ ఫేవరెట్ బ్యూటీ కావడం విశేషం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ రేంజ్‌లో పేరును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనే రాణిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. తన సినీ కెరీర్‌లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు.
ఇక పవన్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా.. పవన్ కు ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పుడు కాస్త కూడా డౌన్ కాలేదు. ఇక ఎప్పటికప్పుడు పవన్ కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూనే ఉంటాడు. అలా ఎంతోమందితో నటించిన పవన్ కళ్యాణ్‌కు ఫేవరెట్ హీరోయిన్ మరవరో కాదు మహానటి సావిత్రి గారు అట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. నా ఫేవరెట్ హీరోయిన్ అంటే అది ఎప్పుడు ఒక్కరే. ఆమె సావిత్రి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.