ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తాజాగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దేవరకు.. సీక్వెల్ గా దేవర పార్ట్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేవర చూసిన ఆడియన్స్ అంతా దేవర పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో కొరటాల.. దేవర పార్ట్ 2కు సంబంధించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. దేవర 2 మరింత పెద్దగా ఉండబోతుందని.. అంతేకాదు ఈ సినిమాల్లో టాప్ సెలబ్రిటీస్ నటించే స్కోప్ ఉందంటూ వెల్లడించాడు.
వారిలో రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ లాంటి సెలబ్రిటీస్ నటించే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. అప్పటినుంచి దేవర పార్ట్ 2కు ఇద్దరిలో ఎవరు నటిస్తారని ఆసక్తి అభిమానంలో మొదలైంది. ఇక ప్రస్తుతం సౌత్ సినిమాలపై బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మన కథలను పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ఇష్టపడుతున్న నేపథ్యంలో.. అక్కడ ఉన్నవారు కూడా తెలుగు సినిమాల్లో నటించాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా సినిమాలో ఛాన్స్ వస్తే నటించేందుకు బాలీవుడ్ నటులు కూడా కాదనడం లేదు. ఆల్రెడీ ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్2 సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. కనుక దేవర 2లో బాలీవుడ్ స్టార్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట డైరెక్టర్ కొరటాల.
అయితే రణ్‌బీర్ రణ్‌వీర్ లలో ఒకరు ఉంటారని హింట్ ఇచ్చారు కానీ.. ఆ ఇద్దరిలో ఎవరని క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం వారి పేర్లు బయటకు చెప్పడంతో ఇద్దరిలో ఏ హీరో నటించిన సినిమా పై రెట్టింపు హైప్ పెరుగుతుంది.. వారిలో ఎవరు నటించిన మాకు ఒకే అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల దేవర 2 ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో చేశాడని అర్థమవుతుంది. దేవర, వర గా తారక్ మరోసారి దుమ్ము దుల్పనున్నాడు. ప్రస్తుతం వార్2 కోసం బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. జనవరి 2025 నుంచి ప్రశాంత్ నీల్ సినిమాకు సిద్ధం కానున్నాడు. ఇక దేవర 2లో నిజంగానే బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ మరింతమంది యాడ్ అయితే.. సినిమా పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టిస్తుందనటంలో సందేహం లేదు.