టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి రేంజ్ హాలీవుడ్‌కు చేరుకుంది. జెమ్స్ కెమరున్, స్టీఫెన్ స్టిల్స్ బర్గ్ లాంటి లెజెండ్రీ డైరెక్టర్లతో ప్రశంసలు అందుకున్న జక్కన్న.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ పై కన్వేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రతి విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటాడు. సినిమా మేకింగ్ అయినా.. ఇతర విషయాలైనా పర్ఫాక్షన్‌తోనే ముందుకు వెళ్తాడు.
దీంతో బెస్ట్ రిజల్ట్ అందుకుంటాడు. ఇక ఏ విషయంలోనైనా కుండ బద్దలు కొట్టినట్లు డేరింగ్ సమాధానాలు చెప్తాడు జక్కన. అలా ఇటీవల ఓ ఈవెంట్లో ఇంటర్వ్యవర్ ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పాడు జక్కన్న. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ అనగానే.. మీ పేరే వినిపిస్తుంది.. మీరే కదా అని యాంకర్ ప్రశ్నించగా.. అసలు దర్శకులకు ర్యాంకులే ఉండవు. నేను నెంబర్ 1 అని ఎప్పుడూ అనుకోను అంటూ సున్నితంగా ఆ ప్రశ్నను తిరస్కరించాడు. ఇక ఇప్పుడున్న జనరేషన్ హీరోలలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే మీరు ఏం చెప్తారు.. అని యాంకర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం జనరేషన్ హీరోలలో నెంబర్ 1, నెంబర్ 2 అని పొజిషన్లు నిర్ణయించలేం.
నాకు తెలిసి ఇప్పటివరకు ఉన్న జనరేషన్లలో టాలీవుడ్ నెంబర్ 1 అంటే సీనియర్ ఎన్టీఆర్ , నెంబర్ 2 అంటే మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు వాళ్ళ తరం కూడా ముగిసిపోయింది. ఈ తరం హీరోలలో ర్యాంకులే ఇవ్వలేము. ఎవరికి వారిదే భిన్నమైన స్టైల్ అంటూ రాజమౌళి వివరించారు. ఇక రాజమౌళి ఇప్పటివరకు.. ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ, ప్రభాస్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేశారు. త్వరలో మహేష్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా తెరక్కించనున్నాడు. ఇక ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో.. భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందనుందని సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.