పుష్ప 2 కి అక్క‌డ సెగ మొద‌లైంది… మామూలు మ్యాట‌ర్ కాదుగా..!

సౌత్ లోనే భాషాభిమానం ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక మొదట ఉంటాయి. అక్కడ ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ తమ భాష పై మక్కువ ఎక్కువ. ఇతర భాషలు ఆధిపత్యాన్ని అసలు సహించలేరు. ఈ క్రమంలోని తమిళనాడులో ఇతర భాషలకు డబ్బింగ్గా తెరకెక్కిన సినిమాలు అస్సలు ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. కర్ణాటకలో అయితే డబ్బింగ్ సినిమాలను గతంలో నిషేధించారు కూడా అయితే కన్నడ సినిమాలు ఇతర భాషలో డబ్బింగ్ అవడం ప్రారంభమయ్యాక.. ఈ నిషేధాన్ని రద్దు చేశారు. దీంతో బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అయి ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

దీంతో భారీ కలెక్షన్ల వర్షం కురిసింది. స్టార్ హీరోల సినిమాలకు కర్ణాటకలో మంచి ఆదరణ వచ్చింది. ఇక కొన్ని ఏరియాల్లో స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యి లాభాలు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ డబ్బింగ్ సినిమాలను ప్రోత్సహించే ట్రెడిషన్ కన్నడ సినిమాలతో సమానమైన ఆదరణ.. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకు ఉంటుంది. అయితే కన్నడ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాలుగా కె.జి.ఎఫ్ 2, కాంతారా ఇప్పటికే రికార్డు సృష్టించాయి. వీటిని బీట్ చేసే రేంజ్‌లో కర్ణాటకలో భారీ ఎత్తున షోలు ప్రదర్శించనున్నట్లు డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. కన్నడ సినిమా అభిమానులకి.. ఇండస్ట్రీ ప్రముఖులకి ఇది డిసప్పాయింట్మెంట్గా అనిపించిందట. అందుకే పుష్ప 2కి కర్ణాటకలో సెగ‌ మొదలైందని.. అక్కడ నిర్మాతల నుంచి వీళ్లకు అవంతరాలు ఎదురవ్వ‌నున్నాయని టాక్ నడుస్తోంది.

Allu Arjun Archives - Ground Fact

ప్రస్తుతం కన్నడ సినిమాలేవి పుష్ప 2కి పోటీగా రిలీజ్ కావడం లేదు. ఒకవేళ అక్కడ లోకల్ సినిమా కనుక రిలీజ్ చేస్తే.. దానికే ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని డిమాండ్ అక్కడ ఏర్పడుతుందని భావిస్తున్నారు. అలా కాకుండా ఏ సినిమా పోటీలో లేకుంటే మాత్రం పుష్ప2కి ఇబ్బంది ఉండదు. ఏదైనా తమిళనాట పుష్ప2కి ఎక్కువ థియేటర్లు దొరకడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక తమిళ్ నేటివిటీలో ఇలాంటి కథ తెరకెక్కిన పెద్దగా సక్సెస్ కాదు. కానీ.. కర్ణాటకలో మాత్రం అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ పుష్ప 2 కలెక్షన్స్‌కి ఎలాంటి డొక్కా ఉండదని మేకర్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కన్నడ సినిమాలు ఏవైనా రిలీజ్ అయితే అప్పుడు వారితో సానుకూల చర్చలు జరిపి థియేటర్స్ లో సినిమా వేయాలని మేకర్స్ భావిస్తున్నారు.