‘ దేవర ‘ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు అంటే..

టాలీవుడ్ మాన్ అఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ దేవర. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీ లెవెల్ లో నెలకొన్నాయి. తారక్ నుంచి దాదాపు ఆరాళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని థియేటర్లలో చూస్తామా అంటూ టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో తారక అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Jr NTR hypes up Devara, says 'last 40 minutes will rock you all' - India  Today

ఈ క్రమంలో సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేవర మొత్తంగా కలిపి రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం. ఇక గతంలో కొరటాల తెరకెక్కించిన ఆచార్య డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఇక తార‌క్‌కు రాజ‌మౌళి బ్యాడ్ సెంటిఒమెంట్ తంతుంది. ఆయిన అవేమి అడురాకుండా కేవలం ఎన్టీఆర్ వ‌ల్ల‌ మాత్రమే ఈ రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరిగాయన‌డంలో సందేహం లేదు. దేవరకు ఈ రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లు జరగడం నిజంగానే విశేషం అని చెప్పాలిజ‌ ఇక ఈ మూవీ ఏ ఏరియాలో ఎన్ని కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందో ఒకసారి తెలుసుకుందాం.

Jr NTR wraps Devara, shares imp message - TeluguBulletin.com

దేవర వైజాగ్ లోనే రూ.12.5 కోట్ల బిజినెస్ జరుపుకోగా ఈస్ట్ లో రూ.8.0 కోట్ల బిజినెస్లను పూర్తిచేసుకుంది. అలా వెస్ట్ రూ.6.50 కోట్లు, కృష్ణాజిల్లా రూ.7.0 కోట్లు, గుంటూరు రూ.8.5 కోట్లు, నెల్లూరు రూ.4.0కోట్లు, సీడెడ్ రూ.22.0 కోట్లు, నైజం – ఏపీ రెండిటిలోను కలిపి రూ.113 కోట్లు, కర్ణాటకలో రూ.15.0 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.0.5 కోట్లు, నార్త్ బెల్ట్ (హిందీ) రూ.15.0 కోట్లు, విదేశాల్లో రూ.26.0 కోట్లు, ఇక ప్రింట్స్‌ అండ్ పబ్లిసిటీకి కలిపి మొత్తంగా రూ.4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్లు జరుపుకుంది. ఇలా మొత్తం మీద.. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్‌లో ఏకంగా రూ.180 కోట్లు రాబట్టింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.