టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.. టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్ లోనూ పలు వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి రాజ్ అండ్ డికె ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు.. తర్వాత కూడా మళ్లీ వెంటనే సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీలో అవకాశాన్ని కల్పించారు రాజ్ అండ్ డీకే. ఈ ముగ్గురి కాంబో బ్లాక్ బాస్టర్ కాంబో అని ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే హనీ బన్నీ త్వరలో ప్రేక్షకుల ముందుకు స్ట్రీమ్ కానుంది. అయితే ఇంకా ఇది స్ట్రీమింగ్ కాకముందే.. రాజ్ అండ్ డీకె.. మరో వెబ్ సిరీస్ సమంతను ఫిక్స్ అయ్యారట.
దీనికి సమంత కూడా సిద్ధం అవుతుంది. నెట్ ఫ్లిక్స్ సిరీస్.. రక్త బ్రహ్మాండ్ – ది బ్లడీ కింగ్డమ్ పేరుతో రూపొందనున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే టీం ఈ సిరీస్ షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టేశారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాజ్, డీకే ప్రొడక్షన్ సంస్థ డిటుఆర్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సిరీస్ రక్తపాతాలను దారి తీసే పరిస్థితులను స్క్రీన్ పై అద్భుతంగా తరికెక్కించనున్నారని టాక్. రక్తపాత రాజ్యంలో జరిగే కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలు రక్తి కట్టిస్తాయట. ఫ్యామిలీ మ్యాన్ తరహాలో గ్రిప్పింగ్ స్టోరీతో ఈ సిరీస్ రూపొందించనున్నారు. ఇక ఇందులో ఆదిత్య రాయికాపూర్, సమంతా రూత్ ప్రభు, ఆలీ ఫాజల్, వామికా గాబి తదితరులు నటించనున్నారే సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక సీరీస్ ప్రీ ప్రొడక్షన్ కోసం టీం ఎంతో కష్టపడుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్రధాన పాత్రలు ప్లే చేస్తున్న సమంతా, ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరూ తమ పాత్రలను పూర్తిగా మలుచుకునేందుకు కట్టినమైనా కసరత్తులు చేస్తున్నారని వివరించారు. ఇక ఇప్పుడు తమ పాత్రలకు తెరపై జీవం పోస్తూ.. వారి ట్రైనింగ్‌కు తగ్గ పరీక్ష ఎదురుకోనున్నారట. ది ఫ్యామిలీ మెన్ మూడో సీజన్‌తో కలిపి ఈ రక్త బ్రాహ్మండ్‌ని ఒకేసారి షూట్ పూర్తి చేసేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ.. రాజ్ నిడమూరు, కృష్ణ డీకే మొదట రక్త బ్రహ్మాండ్ – ది బ్లడ్ కింగ్డమ్ తెరకెక్కించే ప్రతి అంశాన్ని పర్యవేక్షించడంలో బిజీ అయ్యారని.. సృష్టికర్తలు హాస్యం, యాక్షన్ ఆకట్టుకునే కథనాలను మిక్స్ చేసి సమర్ధతతో ఇప్పటికే వారిద్దరిని ఆకట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక కొత్త వెబ్ సిరీస్‌లో ఏవి మిస్ కాకుండా ఉంటాయని.. మిడ్డే కథనం ప్రకారం రక్త బ్రహ్మాండ్ అనేది ఒక కల్పిత రాజ్యంలో సాగే యాక్షన్ ఫాంటసీ సిరీస్ అని తెలుస్తుంది.