తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికి.. ఇప్పటికీ.. అందగాడు, సోగ్గాడు అనే ట్యాగ్ కేవలం హీరో శోభన్ బాబుకు మాత్రమే సొంతం. ఆయన తర్వాత కూడా ఎంతోమంది నటులు వచ్చిన ఆ ట్యాగ్‌ను ఎవరు దక్కించుకోలేకపోయారు. ఇక ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, యాక్టింగ్ మొత్తం ప్రేక్షకులను విపరీతంగా ఈకట్టుకుంది. అప్పట్లో భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో ఏఎన్ఆర్‌తో పాటు శోభన్ బాబు పేరు కూడా ఎక్కువగా వినిపించేది. ఇక టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణ పేర్ల తర్వాత శోభన్ బాబు పేరే వినిపించేది. తెలుగు సినిమాలకు గ్లామర్ల అద్దిన ఈ హీరోకు క్రమశిక్షణ కూడా ఎక్కువేనట. పని విషయంలో ఎంతో స్ట్రిక్ట్‌గా వ్యవహరించేవారిని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక ఈయన కేవలం హీరోగా మాత్రమే సినిమాల్లో వ్యవహరించారు.
వయసు పెరుగుతున్న కొద్ది ఆయనంతట ఆయనే ఇండస్ట్రీకి దూరమయ్యారే తప్ప.. ఎన్ని కోట్లు ఇస్తానన్నా ఇతర పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదు. కారణం తన అభిమానులు తనను హీరోగా, అందాల నటుడిగా చూస్తున్నారని.. కేవలం అలాగే ఎప్పటికీ చూడాలని. ముసలి పాత్రలు, నాన్న పాత్రలు, తాత పాత్రలు లాంటివి చేసి తన అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారట. ఇక మీడియా కానీ.. ఇంటర్వ్యూలు కానీ.. శోభన్ బాబు ఇంటిదాకా వెళ్ళేది కాదు. అలాంటి శోభన్ బాబు తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడారు. జయప్రద, జయసుధ, శ్రీదేవి, రాధ, మాధవి, లక్ష్మీ, విజయశాంతి ఇలా ఎంతో మంది హీరోయిన్ల సరసన నటించారు. అయితే వీరిలో ఒక హీరోయిన్ మాత్రం శోభన్ బాబును ఎప్పుడు అత్త, అత్త అంటూ సరదాగా పిలిచేవారట.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. జయసుధ. తనంటే శోభన్ బాబుకు చాలా అభిమానమట. అలా జయసుధతో ఎన్నో సినిమాలు కలిసి నటించిన శోభన్ బాబు.. సెట్ లో కానీ, బయట కాని జయసుధను అత్త అని పిలిచేవారట. ఈ విషయాన్ని స్వయంగా జయసుధ ఒక సందర్భంగా వెల్లడించింది. జయప్రద హోస్టుగా వివరించిన ఓ షోలో పాల్గొన్న జయసుధ ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంది. ఇక శోభన్ బాబు బాలరామకృష్ణులు సినిమా తర్వాత ఏ ఇతర సినిమాల్లోని నటించలేదు. తన పిల్లలను కూడా ఇండస్ట్రీకి తీసుకురాలేదు. రియల్ ఎస్టేట్లో అప్పటికే కోట్లు సంపాదించి తన ఆస్తిని రెట్టింపు చేసుకున్న శోభన్ బాబు.. ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ అంతా ఇక్కడికి వచ్చి సెటిల్ అయినా.. ఆయన మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. ఇక టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శోభన్ బాబు.. 2008లో 71 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయారు.