జూనియర్ ఎన్టీఆర్, జాన్వికపూర్ జంటగా నటించిన మూవీ దేవర. మొట్టమొదటిసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది. అంతేకాదు జాన్వి ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ క్రమంలో సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి టైంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం నిన్నటి రోజున గ్రాండ్‌గా హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మొదలుపెట్టారు. అయితే అక్కడ అభిమానులు అనుకున్న దానికంటే ఎక్కువగా రావడం.. తాకిడి మూడింతలు అవ్వడంతో హోటల్ ప్రాపర్టీకి కూడా డ్యామేజ్ అయ్యిందట.
అభిమానులు, పోలీసులు మధ్యన పరస్పర వాగ్వాదం కారణంగా.. అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో.. మూవీ టీం దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు. ఈ క్రమంలో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాంటి టైంలో ఎన్టీఆర్ ఓ వీడియోను రిలీజ్ చేయడం అభిమానులకు ప్రశాంతత నిచ్చింది. ఇక ఈ క్రమంలో హీరోయిన్ జాన్వి కపూర్ కూడా తన మొదటి సినిమా కావడం.. అలాగే ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమ, అభిమానాలతో వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆమె పూర్తిగా తెలుగులో మాట్లాడుతున్నట్లు ఓ వీడియోని షేర్ చేయడం జరిగింది. జాన్వి మాట్లాడుతూ తనని ఎంతగా స్వాగతించిన అభిమానులందరికీ ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు తనని ఎక్కడ చూసినా జాను పాప అని పిలుస్తున్నారు. ఎన్టీఆర్ సర్ అభిమానులకు మరీ ముఖ్యంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు నన్ను ఒక సొంత మనిషిలా ఫీల్ అవ్వడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. మీరు కూడా మా అమ్మకి అంతే ఇష్టం. అలాగే నాకు కూడా ఇష్టం అంటూ జాన్వి తెలియజేసింది. ఇంతలా సపోర్ట్ చేసిన ఎన్టీఆర్ సార్ కి, ఎన్టీఆర్ అభిమానులకి, నా అమ్మ అభిమానులకు, నా అభిమానులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే దేవరలో తనను ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకోవడం తన అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది జాన్వి. నా మొదటి ప్రయత్నం నటన మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను అంటూ అమ్మడు వీడియో షేర్ చేసింది. అయితే జాన్వీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా తెలుగు మాట్లాడాలని నేర్చుకొని ప్రయత్నించిందట. కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఇలా వీడియో రూపంలో కొన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది జాన్వి. ఇలా వీడియో తెలుగులో నేను మాట్లాడను నేర్చుకోవడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అంటూ ఆయన పై ఉన్న ప్రేమ వల్లే తెలుగు మాట్లాడాలనుకున్న అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఫ్రీ రిలీజ్ క్యాన్సిల్ అవ్వడం చేత అభిమానులు జాన్వీ మాటలు కూడా మిస్ అయిపోయారు.