నందమూరి యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ నటించిన తాజా మూవీ దేవర ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లోనూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్నారు మేకర్స్. కాగా.. తాజాగా దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ చేశారు మూవీ టీం. సెప్టెంబర్ 22న అంటే నిన్న హైదరాబాద్ నవటెల్‌లో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయగా.. కొన్ని కారణాలతో ఈవెంట్ రద్దు అయిపోయింది.
అయితే దీనికి కారణాన్ని వివరిస్తూ ఎన్టీఆర్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దేవర ఈవెంట్ రద్దు కావడం చాలా బాధ కల్పించింది. ఎప్పుడు అవకాశం వచ్చినా మీతో సమయాన్ని స్పెండ్ చేయాలి.. దేవర సినిమా గురించి ఎన్ని విషయాలు మితో ప్చుకోవాలని ఎదురుచూశా. మూవీ కోసం మేం పడిన కష్టం గురించి ఎన్నో విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకున్న. అయితే భద్రతాపరమైన కారణాలతో ఈవెంట్‌ను రద్దు చేశారు. మీ కంటే నాకు ఎక్కువగా బాధగా ఉందంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
ఫంక్షన్ క్యాన్సిల్ విషయంలో నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్ లను తప్పు పట్టడం సరికాదు. మీ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటా అంటూ ఎన్టీఆర్ వివరించారు. ఇక ఈరోజు మనం కలవకపోయినా ఈ నెల 27న మనం కలుద్దాం. మీరంతా సినిమాను చూసి కాలర్ ఎగరేస్తారని నమ్మకం నాకు ఉంది. ఆ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. కొరటాల ఎంతో కష్టపడి ఈ సినిమాను రూపొందించారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం దేవరకు చాలా అవసరం. మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్న అంటూ వివరించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెనై పలు చోట్ల రికార్డ్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా రిలీజ్ అయ్యి ఇలాంటి రిజల్ట్ అందుకుంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.
We regret being in this situation but are forever grateful to our beloved Man of Masses NTR’s fans. 🙏🏻🙏🏻
The biggest celebration awaits. See you in theatres on Sept 27th.#Devara #DevaraOnSep27th pic.twitter.com/oSXa2ga6Za
— Devara (@DevaraMovie) September 22, 2024