ప్రభాస్ ఎప్పుడు నెత్తిన ఆ క్యాప్ పెట్టుకోవడం వెనుక పెద్ద సీక్రెట్ దాగి ఉందా.. అదేంటంటే..?

రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్.. ఈ పేరుకు యూత్ లో ఉన్న ఫ్యాన్ బేస్, క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్.. భారీ సక్సెస్ అందుకోకపోయినా ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే ఒక్కసారిగా స్టార్ హీరో ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. ఇక త‌ర్వాత‌ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు. అలాంటి ప్రభాస్‌కు సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో ఉంటుంది.

ఇక‌ ప్రభాస్ ఎక్కువగా బయట కనిపించిన సందర్భాల్లో తలకు కాప్ పెట్టుకొని కనిపిస్తూ ఉంటాడు.. క్యాప్ లేకున్నా కచ్చితంగా తలకు ఏదైనా గుడ్డ‌ అయిన కట్టుకొని కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ప్రభాస్ ఎందుకు అలా ఇప్పటికీ బయటకు వచ్చిన సమయాల్లో క్యాప్ పెట్టుకుని కనిపిస్తాడని సందేహం చాలామంది అభిమానుల్లో ఉండే ఉంటుంది. అయితే దీని వెనుక పెద్ద సీక్రెట్ ఉందని టాక్ నడుస్తుంది. అదేంటంటే.. ప్రభాస్ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందుకోసం డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లో మీకోవర్ అవ్వాల్సి ఉంటుంది..

అలా ప్రభాస్ తలకు క్యాప్ పెట్టుకోవడం వల్ల తన నెక్స్ట్ మూవీ హెయిర్ స్టైల్ ఏంటి అనేది జనాలకు తెలియకుండా ఉంటుందని.. మేక‌ర్స్‌ ఎంతో కష్టపడి డిజైన్ చేసిన హెయిర్ స్టైల్ లీక్ కావడం.. దానిని చూసిన ఆడియన్స్‌కు సినిమాలో చూడడానికి కూడా పెద్ద కిక్ ఉండదు. ఈ కారణాలతోనే ప్రభాస్ తన హెయిర్ స్టైల్ లీక్ కాకూడదనే ఉద్దేశంతో బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక క్యాప్ ను లేదా తలకు గుడ్డను చుట్టుకుని కనిపిస్తాడట. అలా తన లుక్ బయటకు రాకూడదనే జాగ్రత్తలు తీసుకుంటాడని టాక్.