సమంత ఇప్పటివరకు ప్రభాస్ తో ఎందుకు నటించలేదో తెలుసా.. కారణం ఏంటంటే.. ?

టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ అమ్మ‌డు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓవెలుగు వెలిగింది. వరుస‌ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు, రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఆక‌ట్ట‌కుంది అయితే స‌మంత‌కు ప్ర‌భాస్‌తో న‌టించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఇక పాన్ ఇండియ‌న్ స్టార్‌గా దూసుకుపోతున్న ప్రభాస్ నుంచి చివరిగా వచ్చిన కల్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

ప్రభాస్ కు ఇష్టమైన స్టార్ హీరో ఎవరో తెలుసా? | pan india rebal star prabhas  favorite hero - Telugu Oneindia

వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ప్రస్తుతం హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. ఈ సినిమాల్లో ఇన్‌స్టా సెలబ్రిటీ హీరోయిన్గా నటిస్తుంది. కాగా అనుష్క, త్రిష, నయనతార, తమన్నా, శ్రియ, కాజల్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో ఆడి పాడిన ప్రభాస్.. సమంతతో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కాగా ఇటీవల ఓ ఇంట‌ర్బ్యూలో ప్రభాస్ సమంతతో ఎందుకు నటించలేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. సమంతతో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయని.. అయితే హైట్ సమస్యతో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు అంటూ వివరించాడు.

Samantha Akkineni

నిజంగా ప్రభాస్ ఇచ్చిన సమాధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. హైట్ లోపాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం ఎవ్వరు చేయరు. అంతేకాదు ప్రభాస్ ఆరడుగుల ఎత్తు ఉంటారు. అలానే మహేష్ బాబు కూడా ఆరడుగులే. గతంలో మహేష్ బాబు – సమంత.. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. దర్శకులు డిసైడ్ అయ్యి సినిమా ఫిక్స్ అయితే హైట్ అసలు సమస్య కాదని.. ప్రభాస్ ఈ విషయంలో అబద్ధం చెప్పాడంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా సాహ సినిమాకు ముందుగా సమంతకే అవకాశం వచ్చిందని.. చివర్లో అది శ్రద్ధ క‌పూర్‌కు వెళ్ళిందంటూ వార్తలు గతంలో వైరల్ అయ్యాయి.