చిరంజీవి నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు.. ఇంతకీ మూవీ ఏంటంటే..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, 90స్‌లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కెరీర్‌కు అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన సినిమా మాత్రం అల్లుడుగారు. ఈ సినిమా ఎలాంటి సంచలన సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, పెదరాయుడు, కుంతీపుత్రుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి భారీ కలెక్షన్లను రాబట్టాడు మోహన్ బాబు. అయితే మోహన్ బాబు సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న బ్యానర్స్ పై.. కే. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో అల్లుడుగారు సినిమా రిలీజ్ అయింది.

మెగా ఫ్యామిలీలో ఒకటే పార్టీ: చిరంజీవి Great Andhra

కాగా ఈ సినిమాను మొదట చిరంజీవితో చేయాలని రాఘవేంధ్ర‌రావు అనుకున్నారట. దానికి ముందే ఇద్దరు కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి పేరుతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అలా తిరిగి మళ్ళీ వీరి కాంబినేషన్‌లో సినిమాతో శ్రీకారం చుడతారని అంతా భావించారు. ఇక అల్లుడుగారు సినిమా చేసి జగదేకవీరుడు రికార్డులను బ్రేక్ చేయాలని రాఘవేంద్రరావు కూడా అనుకున్నారట. అల్లుడుగారు కథ‌ను చిరంజీవికి వినిపించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. సినిమాకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో చిరంజీవి నుంచి రాఘవేంద్రరావుకు ఈ సినిమా మనిద్దరం చేయొద్దు.. ఎందుకంటే సినిమా కథ‌ ప్రకారం క్లైమాక్స్లో హీరోకు ఉరిశిక్ష ఉంటుంది.

Alludugaru (1990) - IMDb

అలా ఉరి శిక్ష పడితే అభిమానులకు నచ్చదు. క్లైమాక్స్ మార్చితే కథ మొత్తం మారిపోతుంది అంటూ వివ‌రించాడ‌ట‌. దీంతో రాఘవేంద్ర చిరంజీవి నిర్ణయాన్ని ఏకీభవించి క్లైమాక్స్ మార్చడానికి ప్రయత్నించారట. అయితే సినిమా కథ మొత్తం క్లైమాక్స్‌పై ఆధారపడి ఉండడంతో.. అది మార్చలేక మోహన్ బాబుని హీరోగా సెలెక్ట్ చేశారట. రాఘవేంద్రరావు సినిమాలో పాటలన్నీ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. మోహన్ బాబుతో పాటు శోభన, సత్యనారాయణ, చంద్రమోహన్ లాంటి ఎంతో మంది న‌టిన‌టులు ఈ సినిమాతో నటించి మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇక ఈ మూవీతో మోహన్ బాబు లైఫ్ టర్న్ అయిపోయింది.