ఏంటి బాలయ్య ఈ మ్యాజిక్.. రోజు రోజుకి ఏజ్ తగ్గిపోతుందే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ.. నందమూరి నటసింహంగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి జోరుపై ఉన్న బాలయ్య.. ఈ సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోను హ్యాట్రిక్ అ్దుకుని రాణిస్తున్నాడు. తన యాక్టింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీనియర్ హీరో.. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక బాలయ్య నుంచి చివరిగా వచ్చిన అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో మూవీ టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

వచ్చేఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. అటు సినీ కెరీర్‌లోను.. ఇటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న బాలయ్య వరుస‌ సినిమాల్లో నటిస్తూనే.. హిందూపురం ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ, మ‌రోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా ప్రజలకు మెరుగైన చికిత్స ఇస్తూ అండగా నిలుస్తున్నారు. ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో త‌న 109వ‌ సినిమా షూట్ ను పూర్తి చేసుకుంటున్నాడు బాలయ్య. అలా ఎన్‌బికే109 నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ బాలయ్య ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా ఇటీవల బాలయ్య లేటెస్ట్ లుక్ ఒకటి తెగ ట్రెండింగ్ గా మారింది. అందులో ఆయన పంచ కట్టుతో బలే క్యూట్ గా కనిపిస్తున్నాడు.

తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టు.. క్లీన్ షేవ్ తో హ్యాండ్సమ్ లుక్ లో ఆకట్టుకున్నాడు బాలయ్య. ఒక్కసారిగా రియేజ్‌నింగ్ బాలయ్య పై భలే పనిచేసింది అన్నట్లుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. ఏంటి బాలయ్య ఈ మ్యాజిక్.. రోజురోజుకు మరింత యంగ్‌గా తయారవుతున్నారే.. నట‌సింహ వయసు మరింతగా తగ్గుతుంది అంటూ.. బాలయ్య వయసు తగ్గుతుందా.. లేదా పెరుగుతుందా.. అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. లైకులు కొడుతూ ఫోటోలను మరింత ట్రెండ్ చేస్తున్నారు. ఇక పిల్ల పిల్లగాడు వెబ్ సిరీస్ తో మంచి ఫేమ్ సంపాదించుకున్న సాయి తేజ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. పైలం పిల్లగా సినిమాతో సెప్టెంబర్ 27న ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలో తమ మూవీ ట్రైలర్ బాలయ్యకు చూపించారు మేకర్స్. బాలయ్య ట్రైలర్ చూస్తున్న టైం లో క్లిక్ చేసిన ఫొటోస్ వైరల్ అవడంతో.. బలయ్య‌ పంచ కట్టు రివీలైంది. అయితే బాలయ్య ఈ స్టిల్స్ ఓ జ్యూలరీ యాడ్ మేకవర్ అని.. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఆ యాడ్లో కనిపిస్తుంది అంటూ.. వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఇది రూపొందించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.