టాలీవుడ్ హీరోయిన్ శివాని యాంగ్రీ యంగ్ మ్యాన్.. సీనియర్ హీరో రాజశేఖర్ కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది శివాని.జ ఇందులో ఆమె మాట్లాడుతూ తనకు మెగా హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందని.. అయితే కథను బోల్డ్‌గా చెప్పడంతో సినిమాను రిజెక్ట్ చేశానని కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సుకుమార్ శిష్యుడుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన బుచ్చిబాబు సన్న ఉప్పెన సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ మూవీలో సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రూ.100 కోట్లు వసూళ్ళు చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే మొదట ఆ ప్లేస్‌లో రాజశేఖర్ కూతురు శివాని యాక్ట్ చేసిందంటూ.. ఆమె స్వయంగా వెల్లడించింది. ఉప్పెన ఆఫర్ తనకు మొదట వచ్చిందని.. డైరెక్టర్ మొదట తనకు కథను వినిపించాడంటూ చెప్పుకొచ్చింది. అయితే దర్శకుడు కథ చెప్పిన విధానానికి, సినిమా తెరకెక్కించిన విధానానికి చాలా తేడా ఉందంటూ వివరించింది.
ముందుగా కథను బుచ్చిబాబు బోల్డ్ గా రాసుకున్నాడని.. అదే కథ తనకు చెప్పాడని వివరించింది. ఇక సినిమాలో ఎక్కువగా లిప్ లాక్స్, అలాగే మరికొన్ని హద్దులు దాటే సన్నివేశాలు కూడా ఉన్నాయని.. దానితో నేను సినిమాలు అంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు. భయమనిపించింది. అందుకే వైష్ణవ్‌తో నటించే ఛాన్స్ ను వదులుకున్న. ఆ సినిమాకు నో చెప్పా అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఫైనల్ గా సినిమా రిలీజ్ అయ్యాక చూసి కాస్త డిసప్పాయింట్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది.