‘ దేవర ‘ సెన్సార్ రివ్యూ.. రన్ టైమ్ ఎంతంటే..? 

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సినిమా మొదటి భాగం దేవర పార్ట్‌ను ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ లెవెల్‌లో జరిపారు. నార్త్ బెల్ట్ పై దేవర మార్కెట్ కోసం పలు ఇంటర్వ్యూస్‌లో కూడా పాల్గొని సందడి చేశారు మూవీ టీం.

NTR Jr's 'Devara Part 1' Unveils Trailer

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేయడం విశేషం. ఇక ఈ సినిమా రన్ టైం ఏకంగా 2గంటల 57నిమిషాల 58సెకెన్లు ఉండనుంది. ఇక ఇటీవల కాలంలో వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నడివి ఉంటున్నాయి. కంటెంట్ బాగుంటే.. న‌డివి ఎంతున్న‌ ప్రేక్షకుల ఆ సినిమాను ఆదరిస్తారని దానికి.. కల్కి, సరిపోదా శనివారం సినిమాలే ఉదాహరణ. ఇది దాదాపు మూడు గంటల నడివితో వెండితెరపై రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Devara Part 1 trailer: Jr NTR, Saif Ali Khan, Janhvi Kapoor film tells a  tale of power and fear - Hindustan Times

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావడం.. అది కూడా ఎన్టీఆర్ నుంచి ఓ సినిమా వెండితెరపై వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని.. ఆఖరి 40 నిమిషాల సినిమా హైలైట్ కాబోతుందని ముంబైలో ట్రైలర్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త‌న కామెంట్స్‌తో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేసాడు. ఇక ఇప్పటికే అమెరికాలో ఫ్రీ బుకింగ్స్ మొదలై కలెక్షన్లతో రికార్డు సృష్టించాయి. ఇప్పటికే ఫ్రీ సేల్స్ ద్వారా వన్ మిలియన్ డాలర్ల మార్పును చేరిన దేవర.. కల్కి రికార్డును బ్రేక్ చేసింది. ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.