ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో భూమిక చావ్లా మొదటి వరుసలో ఉంటుంది.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. హీరో సుమంత్ నటించిన యువకుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో భూమికకు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీలో భూమికకు ఒక్కసారిగా యూత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
ఖుషి సినిమాతో కుర్రకార హృదయాలను దోచుకున్న ఈ అమ్మడు.. తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఒక్కడు సినిమాలో నటించింది. గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక అదే ఏడాది ఎన్టీఆర్ సరసన సింహాద్రి సినిమాలో నటించి ఇండస్ట్రియల్ హిట్ అందుకుంది. దీంతో అప్పటిలో సెన్సేషనల్ బ్యూటీగా భూమిక పేరు మారుమోగిపోయింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ టాలీవుడ్ యూత్ ఫేవరెట్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. మెగాస్టార్.. జై చిరంజీవ సినిమాలోని నటించే అవకాశం దక్కించుకుంది. గ్లామర్ షో మాత్రమే కాదు.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ మెప్పించింది. తెలుగుతోపాటు హిందీలో టాప్ హీరోయిన్గా రాణించింది. తేరే నామ్ లో నిర్జర పాత్రలో భూమిక కు విపరీతమైన పాపులారిటీ దక్కిందిజ ఇక భూమిక తండ్రి రిటైర్డ్ ఆర్మీ కార్మికులు.
మొదట సర్ఫ్ పౌడర్ ప్రకటనతో బుల్లితెరపై కనిపించిన భూమిక.. చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని పట్టుదలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. చదువు పూర్తయిన వెంటనే 1997లో తన కలలను నెరవేర్చుకునేందుకు ఢిల్లీ నుంచి ముంబై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 2000 సంవత్సరంలో యువకుడు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక తర్వాత తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో 50 కి పైగా సినిమాల్లో ఆకట్టుకుంది. తన ప్రియుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ భరత్ ఠాగూర్‌ను ప్రేమించి 2007లో వివాహం చేసుకుంది. భూమిక భర్త భరత్ యోగ టీచర్ కావడంతో.. నటన రంగంలోకి అడుగు పెట్టిన భూమిక.. యోగ పై శ్రధ్ధ చూపించింది. యోగ నేర్చుకుంటున్న టైంలో భూమిక గురువు భరత్ ఠాగూర్ తో ప్రేమలో పడింది. నాలుగేళ్ల ప్రేమలో ఉన్న ఈ జంట.. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీరికి ఓ బాబు కూడా పుట్టింది.
ఇక భూమిక చివరిసారిగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమాలు నటించి మెప్పించింది. తర్వాత తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో హీరో వదినగా ప్రధాన పాత్ర పోషించింది. ఇక తాజాగా ఆగష్ట్ 21న అమ్మడి 46వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ క్రమంలో అమ్మడుకు సంబంధించిన ఓ వీడియో నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ అంతా.. వామ్మో.. ఖుషి బ్యూటీ ఏంటి ఇంతలా మారిపోయింది అంటూ.. ఈ ఏజ్ లోను ఇంత అందంగా ఎలా ఉంటున్నావ్ భూమిక అంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram