నందమూరి నటసింహం బాలకృష్ణ మొదటి నుంచి చాలా పొదుపు మనిషని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. బాగా అవసరం ఉన్న వారికి సహాయం చేయడానికి అసలు వెనకాడడని.. లేదంటే ఆయన తన జేబు నుంచి చిల్లి పైసా కూడా రాల్చడని సన్నిహితుల నుంచి ఎన్నో కామెంట్లు విలువయ్యాయి. ఈ క్రమంలో బాలయ్య విషయంలో మరోసారి ఇది ప్రూవ్ అయింది. బాలయ్య తన సిస్టర్స్ తో కలిసి ఇటీవల రక్షాబంధన్ గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఇక ఈ నందమూరి హీరోకి.. లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి ముగ్గురు అక్క చెల్లెలు వచ్చి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అలాగే బాలయ్యను సరదాగా ఆటపట్టించారు. బాలకృష్ణ కూడా అన్ని మర్చిపోయి చిన్నపిల్లడిలా రక్షాబంధన్ ఎంజాయ్ చేస్తూ అల్లరి చేశారు.
బాలకృష్ణ తన అక్కలను టీజ్ చేస్తున్న వీడియో నెట్టింట తాజాగా తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో అక్క పురందేశ్వరి.. బాలయ్య చిన్నతనంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి వివరించింది. సాధారణంగా రాఖీ కట్టిన టైం లో సిస్టర్స్ కి బ్రదర్స్ ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి. వారికి తన స్థోమతకు తగ్గట్లుగా.. ప్రతి సిస్టర్ కి ప్రేమను చాటుకోవడానికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బాలయ్య బాబు మాత్రం ఇక్కడ కూడా తన పొదుపుతానని చూపించి ప్రేక్షకులను తెగ నవ్వించాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. బాలయ్య చేసిన ఈ అల్లరి కూడా రికార్డ్ అయింది. ఇందులో ఆయన ముందుగా తనకి రాఖీ కట్టిన అక్క లోకేశ్వరికి బహుమతిగా కొంత డబ్బును ఇచ్చాడు. అక్కడి వరకు బానే ఉంది. అయితే బాలయ్య పురందేశ్వరి, భువనేశ్వరి ఇద్దరికి రాఖీలు కట్టారు.
వారికి కూడా గిఫ్ట్ ఇవ్వాలి. అయితే బాలయ్య కొత్తగా వారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అక్క లోకేశ్వరికి ఇచ్చిన డబ్బులు ఇచ్చి.. తీసుకోండి ఇదిగో మీ గిఫ్ట్ అంటూ వాళ్లకి ఇస్తూ తెలివిని ప్రదర్శించారు. ఈ క్రమంలో పురందేశ్వరి.. బాలకృష్ణ పొదుపుతనాన్ని చూసి ఓ రేంజ్ లో టీజ్ చేసింది. ఛి.. ఛి ..ఇదే పని వీడు చిన్నప్పుడు కూడా చేశాడంటూ చెప్పుకొచ్చింది. ఒకసారి బిచ్చగాడికి కేవలం 10 పైసలు బిచ్చం వేశాడని.. దీంతో అమ్మ కూడా షాక్ అయ్యిందని.. మరీ పది పైసలు వేసావ్ ఏంట్రా.. అని అడిగితే అప్పుడు కూడా బెగర్ దగ్గర నుంచి మళ్లీ ఆ పది పైసలు తీసుకుని.. అతనికి మళ్ళీ ఆ 10 పైసలే ఇచ్చాడంటూ పురందేశ్వరి బాలయ్య ను టీజ్ చేసింది. బాలయ్యతో అట్లుంటది మరి అనుకుంటూ అక్కడ ఉన్న వారంతా నవ్వేశారు. ఏదేమైనా బాలయ్య చాలా భిన్నమైన వ్యక్తి. అయినా ఆయన మంచి మనసు అందరికీ తెలుసు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పటికే ఆయన ఎంతోమంది ప్రాణాలను కాపాడారు.