ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత వారికి సంబంధించిన సినిమాల అప్డేట్స్ తో పాటు.. పర్సనల్ అప్డేట్స్ కూడా నెటింట ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటాయి. వారు వాడే లగ్జరీ కార్ నుంచి వాళ్ళ లగ్జరీ లైఫ్, వారి ఫ్యామిలీ విషయాల వరకు ఎదో ఓ విషయం బయటకు రావటం.. ఏ విషయం రివీల్ అయ్యినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక చెల్లెలుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నెటింట ట్రెండింగ్‌గా మారింది. చాలామందికి రష్మికకు చెల్లి ఉందని విషయం కూడా తెలిసి ఉండదు. అయితే గతంలో ఈ విషయాన్ని రష్మిక తెలియజేస్తూ ఫోటోలు కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.
కాగా రాఖీ పండుగ సందర్భంగా మరోసారి తన చెల్లెలుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అందరిని షాక్ ఇచ్చింది. ఇక రష్మిక చెల్లి పేరు షిమన్ మందన. షిమన్ కూడా రష్మికకు లాగే ఎంతో క్యూట్ గా, అమాయకంగా కనిపిస్తూ ముద్దొస్తుంది. అయితే రష్మిక తన చెల్లెలికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందో తెలిస్తే ఖచ్చితంగా నోరెళ్లబెడతారు. దాదాపు వీరిద్దరి మధ్య 16 ఏళ్ల ఏజ్‌గ్యాప్ ఉంటుందట. గతంలో ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ తన చెల్లెల గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
తన చెల్లి అంటే ఆమెకి ఎంతో ఇష్టమని.. చిన్న వయసులోనే తనకు డ్రెస్ వేయడం.. డైపర్స్ చేంజ్ చేయడం లాంటివి చేశానని.. అయితే ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా గడపడం వల్ల.. ఆమెకు తక్కువ టైం ఇవ్వగలుగుతున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక చాలాకాలం తర్వాత మరోసారి రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలుతో దిగిన ఫోటోలను రష్మిక షేర్ చేస్తూ.. ఎమోషనల్ స్టోరీ ని పంచుకుంది. ఈ క్రమంలో వామ్మో.. రష్మికకు మరి ఇంత చిన్న చెల్లెలు ఉందా అంటూ.. తన చెల్లెలు కూడా భలే క్యూట్ గా అమాయకంగా కనిపిస్తుంది.. అంటూ వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఎలా ఉంటుందో ఈ పిక్స్ చూస్తూనే అర్థమవుతుంది అంటూ.. పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక తన చెల్లెల్ని కూడా తనలాగే ఇండస్ట్రీకి పరిచయం చేసి టాప్ హీరోయిన్గా నిలబెడుతుందా.. లేదో.. వేచి చూడాలి.