నందమూరి నటసింహం బాలకృష్ణ నటవరసడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కి అంత సిద్దమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై మోక్షజ్ఞ మెరవడానికి ఆలస్యమైంది. మోక్షజ్ఞ మూడు పదుల వయసు దగ్గర పడుతున్న క్రమంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడు. ఇక బాలయ్య బాల్యంలోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక తారక్ అతి చిన్న వయస్సులోనే రాముడు పాత్రలు నటించాడు. 20 ఏళ్లకే మాస్ హీరో గా అరుదైన ఘనత దక్కించుకున్నాడు. మోక్షజ్ఞ మాత్రం మూడు పదుల వయసు దగ్గర పడుతున్నా.. ఇంకా మేనమేషాలు లెక్కిస్తూనే ఉన్నాడు. 2024లో మోక్షజ్ఞ డబ్ల్యూ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందంటూ విశ్వాసనీయ వర్గాల సమాచారం.
గతంలో షేప్ అవుట్ బాడీతో కనిపించని మోక్షజ్ఞ.. ఇప్పుడు యంగ్ లుక్ తో మేకోవర్‌తో రెడీ అయ్యాడు. స్లిమ్ అండ్ ఫీట్‌గా కనిపిస్తూ.. నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్ పై పరిచయం చేసే బాధ్యత హనుమాన్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కు బాలయ్య అప్పచెప్పారు. కథ కూడా లాక్ అయిపోయిందని.. సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యమని తెలుస్తోంది. ఈ మూవీ భారీగా ప్లాన్ చేస్తున్న క్రమంలో.. పాన్ ఇండియన్ సినిమాగా పలు భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ పాన్ ఇండియా సినిమా కీలక పాత్రల కోసం ఎన్నో పరిశ్రమలకు చెందిన నటులను తీసుకోవడం కచ్చితంగా అవసరం. అది ఇతర మార్కెట్లో తమ సినిమా బిజినెస్ కు ఉపయోగపడుతుంది.
ఈ క్రమంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్‌ను ఎంచుకున్నారట. అతను మరెవరో కాదు.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్. కథలో కీలకమైన పాత్ర కోసం అమితాబ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడనే ఉద్దేశంతో.. ప్రశాంత్ వర్మ అమితాబ్ ను అప్రోచ్ అయ్యినట్లు తెలుస్తుంది. కాగ గతంలో బాలయ్య తో నటించే అవకాశం వచ్చిన అమితాబ్ దానిని రిజెక్ట్ చేశాడు. డైరెక్టర్ కృష్ణవంశీ.. బాలకృష్ణ – అమితాబ్ కాంబోలో సినిమా తెరకెక్కించాలని భావించారట. ఈ ప్రాజెక్టును సున్నితంగా రిజెక్ట్ చేశాడు. అయితే అమితాబ్ రిజెక్ట్ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్. అప్పుడు బాలయ్యకు నో చెప్పిన అమితాబ్.. ఇప్పుడు మోక్షజ్ఞతో స్క్రీన్ షేర్ చేసుకుంటాడో.. లేదో.. వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన శ్రీలీల కనిపించనుందట. ఇక ఈ సినిమాతో మోక్షజ్ఞ కెరీర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.