ఇంద్ర సినిమాకే హైలెట్గా నిలచిన ఆ డైలాగ్ ఎలా పుట్టిందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రియల్ హిట్ సినిమాలలో ఇంద్ర సినిమా ఒకటి. బి.గోపాల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ ద‌త్త్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్లుగా మెప్పించారు. మ‌ణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో మంచి ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఈ సినిమా ఇండస్ట్రియల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ సక్సెస్ తో అప్పట్లోనే కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. ఇక నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. మరోసారి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

B Gopal Again Start Direction - Telugu Bulletin

తాజాగా ఈ సినిమా రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మూవీ డైరెక్టర్ బి. గోపాల్.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను.. కీలక విషయాలను.. రివిల్ చేశాడు. ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారి సినిమా గురించి ఎంతో ఆరాటపడుతూ ఉంటాడని.. సినిమాల్లో సన్నివేశాలు బాగా రావడానికి ఎప్పుడు సినిమా కోసమే ఆలోచనలు చేస్తూ ఉంటాడని.. ఇంద్ర సినిమా విషయంలోను అంతే.. ఎఫ‌ర్టట్ పెట్టాడని.. ఓ డైలాగ్ కోసం చిరంజీవి ఇచ్చిన ఇన్ఫిట్ అద్భుతంగా ఉంటుందంటూ వెల్లడించాడు. ఇంద్ర సినిమాల చిరంజీవి మేనల్లుడు క్యారెక్టర్ లో ఓ అబ్బాయి నటించగా.. షౌకత్ అలీఖాన్ కూతుర్ని అతను ప్రేమిస్తాడు. అది తెలిసిన షౌకత్ అలిఖాన్ చిరు.. మేనల్లుడ్ని విపరీతంగా గాయపరిస్తారు.

చిరంజీవి విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ఈ సన్నివేశం దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే చిరంజీవి అక్కడికి వెళ్లి వాడిని పెంచింది నేనే కాబట్టి వాడు చేసిన తప్పుకు కూడా నన్ను శిక్షించండి అని చెప్తాడు. వాళ్లు కూడా అలాగే చిరంజీవిని కొట్టడం మొదలుపెడుతారు. ఇక చిరంజీవి దెబ్బలు తిన్న తర్వాత మేనల్లుడు పట్టుకొని నడుస్తూ అలాగే వెళ్ళిపోతాడు. అలా మేము సన్నివేశాన్ని రాశాం. కానీ చిరంజీవి మాత్రం ఆ సీన్ ఇంకా పూర్తి కాలేదు.. అక్కడ ఒక డైలాగ్ ఉంటేనే బాగుంటుంది.. వెంటనే ఒక డైలాగ్స్ సన్నివేశానికి తగ్గట్టుగా రాయమని పరిచరి గోపాలకృష్ణకు ఫోన్ చేసి చెప్పారట. ఆయన వెంటనే తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాం.. లేదంటే తలలు తీసుకుని వెళ్లే వాళ్ళం.. అనే డైలాగులు రాసి ఇచ్చారట. ఇక ఇంద్రా సినిమాల్లో ఆ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్స్ లో ఎలాంటి మోత మోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా చిరంజీవి ఇచ్చిన సలహా ఇంద్ర సినిమా విజయంలో ఓ హైలెట్గా నిలిచింది అని బి. గోపాల్ వివరించాడు.