సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు కలిసి నటించిన క్రమంలో.. వారి మధ్యన మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మంచి ఫ్రెండ్స్ అవడమే కాదు.. వారి కోసం పలు సందర్భలలో.. వారికి నచ్చకపోయినా కొన్ని పనులు చేసిపెడుతూ ఉంటారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు తమ ఇష్టం లేకుండా.. తమకు నష్టం వస్తుందని భావించినా.. ఆ హీరోలపై ఉన్న అభిమానంతోనే కొన్ని పనులు చేస్తారు. అలా ఈ స్టార్ హీరోయిన్లు కూడా తమ ఫేవరెట్ హీరోల కోసం ఎలాంటి పనులు చేశారో ఒకసారి తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ – కాజల్
జూనియర్ ఎన్టీఆర్, కాజల్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులు మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక యాక్షన్ డ్రామా ఫిలిం.. జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్ తో పాటు.. మోహన్‌లాల్ ,నిత్యామీనన్, సమంత రూత్ ప్రభు నటించిన మెప్పించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో పక్కా లోకల్ పాట సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఐటమ్ సాంగ్‌కు కాజల్ అగర్వాల్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకుంది. అప్పటిదాకా స్టార్ హీరోయిన్గా రాణించిన కాజల్.. ఐటమ్ సాంగ్స్ చేయడం ఏంటి అన్న సందేహాలు వెలువడ్డాయి. అయితే నిజానికి ఆమె డబ్బు కోసం ఆ పాటలో నటించలేదు. కేవలం తారక్ పై ఉన్న అభిమానంతోనే ఆ పాటకు డ్యాన్స్ చేయడానికి ఒప్పుకున్నానని.. తర్వాత ఎన్నో సినిమాలు ఐటెం సాంగ్ ఆఫర్లు వచ్చిన.. వాటిని రిజెక్ట్ చేసానంటూ స్వయంగా కాజల్ వివరించింది.
సూర్య – సాయి పల్లవి
పొలిటికల్ యాక్షన్ ఫిలిం నంద గోపాలం కుమారన్(NGK) సినిమాలో సాయి పల్లవి తన భర్తను అనుమానించే భార్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నిజానికి ఇలాంటి పాత్ర చేయడం ఆమెకు అసలు ఇష్టం ఉండదట. కానీ కేవలం సూర్య పై ఉన్న ఇష్టం తోనే.. ఈ సినిమాలో ఆ పాత్రలో నటించినట్లు వెల్లడించింది.
జీవిత – రాజశేఖర్
జీవితా – రాజశేఖర్ వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో వీరు ఇద్దరు కలిసి నటించిన సినిమాల్లో తలంబ్రాలు సినిమా ఒకటి. ఇక ఈ సినిమా టైంకి వీరిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. కానీ రాజశేఖర్ అంటే జీవితకు బాగా ఇష్టం ఉండేదట. ఆ టైంలోనే రాజశేఖర్ కి యాక్సిడెంట్ కావడంతో.. అతను ఆసుపత్రి పాలయ్యారు. అప్పుడు ఆసుపత్రికి వెళ్లి అతని పక్కనే ఉండి.. రాజశేఖర్ కోసం అన్ని సపర్యాలు చేసింది జీవిత. అలా అతన్ని కట్టుకున్న భార్య లాగా సేవలు చేసింది.
దీపిక పదుకొనే – షారుక్
బాలీవుడ్ నటులు దీపిక పదుకొనే, షారుఖ్ ఖాన్ చాలా మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలుసు. ఇక పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఇద్దరు స్టార్స్.. ఒకరిపై ఒకరు ఎంతో అభిమానం చూపిస్తూ ఉంటారు. అయితే జవాన్ సినిమాలో షారుక్ పై ఇష్టంతోనే దీపిక గెస్ట్ రోల్‌ను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే చేసిందట.