తొలివలపు సినిమా తో మొదటిసారి తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన గోపీచంద్ కి మళ్లీ యజ్ఞం సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఇక యజ్ఞం మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో గోపీచంద్ పూర్తిగా హీరోగానే మారిపోయారు.
గోపీచంద్ హీరోయిన్ అనుష్కతో శౌర్యం, లక్ష్యం సినిమాల్లో నటించారు.
ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేసరికి వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. దీంతో పాటు రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇదే టైంలో ఓ టాప్ డైరెక్టర్ గోపీచంద్ చేయబోయే నెక్స్ట్ సినిమాలో కూడా అనుష్కని హీరోయిన్ గా సెట్ చేశారట. ఈ విషయం తెలుసుకున్న గోపీచంద్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకొకసారి నువ్వు ఆ హీరోయిన్ తో తిరిగినా.. నటించినా నీ కాళ్లు విరగ్గొడతాం వార్నింగ్ ఇచ్చారట. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు.