హీరోయిన్ న‌మిత కిడ్నాప్‌.. బ‌ల‌వంతంగా పెళ్లి..?

హీరోయిన్ నమిత తన అందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని కట్టిపడేసింది. న‌మిత అంటే భారీ అందాల ముద్దుగుమ్మ‌… తెలుగులో న‌మిత తొలి సినిమా విక్ట‌రీ వెంక‌టేష్ జెమినీ. ఆ త‌ర్వాత సొంతం, ఒక రాధా ఇద్దరు కృష్ణుల ప్రేమ కథ వంటి సినిమాల్లో నటించినా తమిళంలో మాత్రమే నమితకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ త‌ర్వాత నమిత బరువు పెరిగిపోవడంతో ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మ అయింది.

 ఇదిలా ఉంటే ఆమె మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు… నమితని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలని చూసారట. వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నమిత ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. నమిత ఓ రోజు షూటింగ్ కోసం తన మేనేజర్ తో కార్ కోసం వెయిట్ చేస్తోంద‌ట‌. ఆ టైంలో ఒక వ్యక్తి నేనే మీ కార్ డ్రైవర్ ని అని నమిత ని, మేనేజర్ ని ఎక్కించుకొని వెళ్లారట. ఇక కారు ఎక్కిన సమయంలో నమిత హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాట‌లు వింటూ ఆ మాయ‌లో ప‌డిపోయింద‌ట‌

ఎంతసేపటికి తాను వెళ్లాల్సిన గమ్యం రాకపోయేసరికి నమితకి అనుమానం వచ్చిందట. అంతే కాకుండా డ్రైవర్ భాష కూడా అనుమానంగా ఉండడం.. ఆమె కారుని మరో అయిదు కార్లు ఫాలో అవుతుండ‌డంతో ఆమె గట్టిగా నిల‌దీసింద‌ట‌. దీంతో ఇదంతా ఏంటి అని అడిగేసరికి మీరు కిడ్నాప్ అయ్యారు అని మేనేజర్ చెప్పారట. ఆ డ్రైవర్ రూపంలో నమితని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆమె వీరాభిమాని. కిడ్నాప్ చేసి నమితను పెళ్లి చేసుకోవాలని చూసారట. ఇదంతా 2009లో కోయంబ‌త్తూరులో జ‌రిగింద‌ట‌.