ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఎలాంటి డైలాగ్స్ అయినా సరే ఒక్క సింగిల్ టేక్ లోనే చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన హీరోగా పేరు సంపాదించారు. డాన్స్ విషయంలో కూడా ఇతర హీరోలను డామినేట్ చేసేలానే ఉంటుంది.. అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఆయన అంతగా అభినందిస్తూ ఉంటారు. గతంలో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్క మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు.
పాన్ ఇండియా లేవల్లో మార్కెట్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇతర దేశాలలో కూడా తన సినిమాలకు భారీ క్రేజ్ ఏర్పడేలా ప్రణాళికను సైతం రూపొందించుకొని మరి ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది చిత్ర బృందం. దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో దేవర సినిమా కంటే ముందుగానే ఒక సినిమాని చేయవలసి ఉన్నదట.. ఆ చిత్రము ఏదో కాదు విక్రమ్.. అయితే ఈ ప్రాజెక్టుకి ఎన్టీఆర్ సైతం ఒప్పుకోలేదట.. అందుకు కారణం కేవలం దేవర సినిమాకి కొరటాల శివకు మాట ఇవ్వడం వల్ల విక్రమ్ సినిమాని త్యాగం చేయవలసి వచ్చిందట.. దేవర రెండు భాగాలుగా ఉండడంవల్ల.. ఈ సినిమాకి ఎక్కువగా డేట్లు కేటాయించారట.. అలా డైరెక్టర్ లోకేష్ కి ఇబ్బంది వస్తుందని ఆలోచించి ఆ సినిమానే వదిలేసుకున్నారట ఎన్టీఆర్. లేకపోతే విక్రమ్ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ అందుకునేవారు ఎన్టీఆర్.