ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో బిజీగా ఉండడమే కాకుండా అప్పుడప్పుడు సహాయమని అడిగిన వారందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు బాలయ్య. డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ తో కూడా తనకి బాగా పరిచయం ఉందని ఆ పరిచయం వల్లే బాలయ్యకు ఒక మంచి కథను సిద్ధం చేయాలని సూచించారట సీనియర్ ఎన్టీఆర్.
అలా ఒక అద్భుతమైన కథను బాలకృష్ణ కోసం వినిపించగా కేవలం పదినిమిషాలలోని కథ విని ఓకే చేశారని తెలియజేశారు కోదండరామిరెడ్డి. ఆ సినిమా ఏదో కాదు” అనసూయమ్మ గారి అల్లుడు”. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యతో చాలా సరదాగా గడిపామని తెలియజేశారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అయినప్పటికీ కూడా బాలయ్య చాలా అనుకువగానే అందరితో కలిసి మెలిసి సినిమా షూటింగ్లో కనిపించే వారిని అలాగే పెద్దవాళ్ళను కూడా గౌరవించే వారిని కోదండరామిరెడ్డి తెలిపారు.
ముఖ్యంగా సినిమా షూటింగ్ సెట్లో వచ్చారంటే చాలు.. భోంచేసారా టీ తాగారా అని అందరిని ఆప్యాయంగా అడిగే వారిని.. స్టార్ హీరో కొడుకని ఎలాంటి గర్వం లేకుండా మాట్లాడేవారని తెలిపారు. అందుకే బాలయ్యతో ఎక్కడ మాట్లాడినా కూడా కచ్చితంగా బాలకృష్ణ గారి గురించి చెబుతూ ఉంటానని ఆయన గొప్పతనం గురించి చెబుతూ ఉంటానని తెలిపారు. ప్రస్తుతం బాలయ్య పైన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.