శ్రీ లీల బాలీవుడ్‌కు ఎందుకు వెళ్ల‌ట్లేదు.. అస‌లేం జ‌రిగింది..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగులో భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త కామెడీ యాక్షన్ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నదట. అందులో భాగంగానే ఈమె హీరోయిన్గా ఎంపిక అయిందంటూ వార్తలు కూడా వినిపించాయి.

కానీ ఇప్పుడు శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాల కారణంగా డేట్స్ క్లాష్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. హీరోయిన్ లేకుండానే సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయిందని చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై తాజాగా చిత్ర నిర్మాత రమేష్ తురాని స్పందిస్తూ.. ఇది తప్పుడు వార్త ఈ సినిమాలో హీరోయిన్గా ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు హీరోయిన్ బడ్జెట్ ఖరారు కాకపోవడం వల్లే హీరోయిన్ గా ఎవరిని తీసుకోలేదు ప్లాన్ ప్రకారమే ఒక నెల షూటింగ్ పూర్తి చేసామని చెప్పారు.

ముఖ్యంగా కొంతమంది హీరోయిన్ల గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే హీరోయిన్ ను ఖరారు చేసి స్పష్టం చేస్తాము అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో శ్రీ లీలను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పినా ఆయన ఇప్పుడు ఇలా చెప్పడంతో ఈ వార్తలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.