మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. కానీ హీరోయిన్ గా ఈమె సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఇటీవల వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మారింది. అందులో భాగంగానే తాజాగా ఈమె నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు.
ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. నిహారిక అందులో భాగంగానే ఒక స్టార్ హీరో అంటే పిచ్చి అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చింది.
కమిటీ కుర్రోళ్ళు ఆగస్టు 9వ తేదీన థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అందులో పాల్గొంటున్న నిహారిక పలు విషయాలను బయటపెడుతోంది.
అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ ఈ ముగ్గురిలో ఎవరంటే ఎక్కువగా ఇష్టమని నిహారికను అడగగా ఎటువంటి సందేహం లేకుండా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని రెబల్ స్టార్ కామెడీ అంటే పిచ్చి ఇష్టం అని కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోనని చెప్పుకొచ్చింది నిహారిక. ఏది ఏమైనా తన మనసులో మాటను ఈ విధంగా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.