పుష్ప 2 రిలీజ్ కాకముందే అన్ని కోట్లు నష్టం.. నిర్మాతలకు షాకేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప.2021 లో ఈ సినిమా విడుదల ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా బాలీవుడ్లో కాసుల వర్షాన్ని కురిపించింది. అలా విడుదలైన అన్ని భాషలలో కూడా కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడమే కాకుండా ఏకంగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు అందుకునేలా చేసింది.

దీంతో పుష్ప-2 సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని పుష్ప సినిమాకు మించి మరీ తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. కానీ పుష్ప-2 సినిమా రిలీజ్ కాకముందే.. నిర్మాతలకు 50 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పుష్ప-2 సినిమా వాయిదా పడడమే అన్నట్లుగా సమాచారం.

సినిమా షూటింగ్ వాయిదా పడుతూ ఉండడంతో మైత్రి మూవీ మేకర్స్ వారికి దాదాపుగా 35 కోట్ల రూపాయల వరకు నష్టం   వాటిల్లిందట. అలాగే ఇందులో ప్రొడక్షన్ షెడ్యూల్, మార్కెట్ ఇతరత్రా ఖర్చులను కలుపుకొని మరో 15 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. పుష్ప-2 సినిమా పైన భారీ హైప్ ఉన్నది కానీ ఈ సమయంలో వాయిదా పడుతూ ఉండడం చేత ఈ సినిమా ఎఫెక్ట్ కచ్చితంగా ఓపెనింగ్ డే మీద పడేటట్లు ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రకంగా కూడా నిర్మాతలు భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.