టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. తన మార్కెట్ ను రూ .1000 కోట్లకు పెంచుకున్నాడు. దాంతోపాటే పారితోషకం కూడా పెంచుకుంటున్న విషయం తెలిసిందే. సినిమా సినిమాకి పారితోషకం పెంచుకుంటున్నారు కదా మరి ఆ డబ్బునంత ఎక్కడ పెడుతున్నారు అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
గత రెండు సంవత్సరాల నుంచి ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం హనురాఘవపూడితో సినిమాతో పాటు భవిష్యత్తులో చేయబోయే సినిమాల కోసం కూడా తన పారితోషకం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒక్కో సినిమాకి రూ.200 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నారని సమాచారం. ఇక ప్రభాస్ కు థియేట్రికల్, నామ్ థియేట్రికల్ మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఆయన అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
. అంతేకాదు ఇండియాలో బెస్ట్ హోస్టులలో ఒకరిగా నిలిచారు ముఖ్యంగా వెజ్, నాన్ వెజ్ వంటకాలు తన టీంలో ఉండేవారు ఆశ్చర్యపోయేలా అరేంజ్ చేస్తూ ఉంటారట. ముఖ్యంగా తన సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్లో పెడుతున్నట్లు సమాచారం రీసెంట్గా ఇటలీలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారట. ముంబై లోను హైదరాబాద్ శివారులో కూడా భారీ ఎత్తుగా బంగ్లాలు , ఫ్లాట్‌లు ఉన్నాయని తెలుస్తోంది.