బాలకృష్ణ- నాగార్జున మధ్య దూరం పెరగడానికి ఆ సంఘటనే కారణమా..?

గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని అభిమానులు బాలకృష్ణ పైన ఫైర్ అయ్యారు.

ఈ విషయం పైన అక్కినేని కుటుంబం కూడా చాలా సీరియస్ గానే మాట్లాడింది. దీంతో బాలకృష్ణ ఈ విషయం పైన మాట్లాడుతూ తనకు బాబాయి లాంటి వ్యక్తి ఆయనతో ఎన్నో సినిమాలలో నటించానని తెలిపారు. అయినప్పటికీ కూడా బాలయ్య పైన చాలా ట్రోల్ చేయడం జరిగింది. గతంలో మంచి స్నేహితులుగా ఉన్న నాగార్జున, బాలయ్య సన్నిహిత్యం వల్ల నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య నటించిన జోష్ సినిమా ఆడియో లాంచ్ కి కూడా గెస్ట్ గా వచ్చారు.

అయితే అటు నాగార్జునకు బాలయ్యకు చెడింది ఎక్కడ అంటే.. జోస్ ఆడియో ఫంక్షన్ లో బాలయ్య మాట్లాడుతూ. నాగార్జునకి అచ్చం నాగేశ్వరరావు పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన కూడా పక్కా కమర్షియల్ బిజినెస్ మాన్ గా కనిపిస్తూ ఉంటారంటూ స్టేజ్ మీదే బాలయ్య నాగార్జునకు సెటైర్ వేయడం జరిగిందట. ఈ సెటైర్ వల్ల నాగార్జున ఆ సమయంలో నవ్వాలో కోపగించుకోవాలో తెలియక అలాగే ఉండిపోయారు. ఈ విషయము నాగార్జునను బాధ పెట్టడంతో వీరి మధ్య అప్పటినుంచి మాటలు దూరమయ్యాయి అనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.