టాలీవుడ్ ఎనప్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చివరి 7 సినిమాల లిస్ట్ ఏంటో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాల ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ వివరాలేంటో ఒకసారి చూద్దాం.
డబల్ ఇస్మార్ట్
రామ్ పోతినేని తాజాగా డబల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజైన తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలిపి రూ. 6.10 కోట్ల షేర్ కలక్షన్లు సాధించింది. పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది.
స్కంధ
ఈ ఏడాది రామ్ పోతినేని నుంచి వచ్చిన మరో సినిమా స్కంధ.. రామ్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్గా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.8.62 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
వారియర్
రామ్ పోతినేని హీరోగా వచ్చిన మరో మూవీ వారియర్. కృతి శెట్టి హీరోయిన్‌గా.. లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.7.02 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కించుకుంది.
రెడ్
రామ్ హీరోగా తెరకె్కిన రెడ్ మూవీ కి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5.47 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.
ఇస్మార్ట్ శంకర్
రామ్ హీరోగా.. నబా నటేష్ , నిధి అగర్వాల్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ కి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.7.73 కోట్ల కలక్షన్లు వచ్చాయి.
హలో గురు ప్రేమ కోసమే
హలో గురు ప్రేమ కోసమే సినిమాలో రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.3.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
ఉన్నది ఒకటే జిందగీ
రామ్ హీరోగా వచ్చిన ఇంకో మూవీ ఉన్నది ఒకటే జిందగీ.. సినిమాకి ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.3.65 కోట్ల కలక్షన్లు వచ్చాయి.