దేవర సినిమాకు సైఫ్ అలీ ఖాన్ రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది.. ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో స్టార్ హీరోలుగా కొనసాగిన ఎంతోమంది ఇప్పుడు సౌత్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగా విలన్ పాత్రలో అవకాశాలు వచ్చిన సరే.. వెనక్కు తగ్గకుండా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న క్రమంలో.. బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఇక్కడ మేకర్స్ భాగం చేసుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వారికి ఉన్న క్రేజ్, మార్కెట్ రిత్యా తమ సినిమాల్లో పాత్రలకు తీసుకుంటూ వారికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

ఇక త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తారక్ హీరోగా నటిస్తున్న కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న దేవర ప్రేక్షకుల ముందుకు రానన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలి ఖాన్‌ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా.. ఇది క్షణాల్లో నెటింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ బైరా పాత్రలో నటిస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా గ్లింప్స్ తో ఇతని పాత్ర ఎలా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

Devara: First look poster of Saif Ali Khan revealed | Latest Telugu cinema  news | Movie reviews | OTT Updates, OTT

ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్నాడని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. తాజాగా దీనికి సంబంధించిన వార్త‌లు నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. సైఫ్ ఈ మూవీలో పాత్ర కోసం ఏకంగా రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సైఫ్.. టాలీవుడ్ సినిమాలో విలన్ గా నటించడం కోసం.. ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయ‌డంతో మేకర్స్ దానిని చెల్లించడానికి సిద్ధపడ్డారట. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయనకున్న క్రేజ్ ఈ సినిమాకు మార్కెట్ పరంగా బాగా కలిసొస్తుందని నమ్మకంతో.. నిర్మాతలు ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ ఆయనకు చెల్లించినట్లు సమాచారం. ఇక కేవలం విలన్ పాత్రకు రూ.20 కోట్ల రేంజ్‌లో ఇవ్వడమంటే అది సాధారణ విషయం కాదు.