ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా.. ఓ స్టార్ హీరో భార్య.. యూత్ లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్..?

సినీ ఇండస్ట్రీకి చెందిన.. స్టార్ హీరో, హీరోయిన్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న.. సెలబ్రిటీల ఫొటోస్ ఎప్పటికప్పుడు నెటింట‌ వైరల్ అవుతూనే ఉంటాయి. అభిమానులు కూడా వాటిని మరింత ట్రెండ్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా ఓ చిన్నారి ఫోటో నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. పై ఫోటోలో ఉన్న ఈ అమ్మడు కూడా.. ఓ స్టార్ హీరోయిన్. అంతేకాదు ఈ అమ్మడి భర్త కూడా పెద్ద స్టార్ హీరో. ఇక ఈ చిన్నది తెలుగులో నటించింది ఒక్క సినిమానే అయినా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఫస్ట్ సినిమా తోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.

ఎంతోమంది యూత్ కలల రాకుమారిగా మారింది. ఇలాంటి క్రమంలో వరుస ఆఫర్లు అందుకుంటూ.. స్టార్‌డంతో దూసుకుపోతున్న.. ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ మంచి ఫామ్‌లో ఉన్న క్రమంలో స్టార్ హీరోని వివాహం చేసుకుని కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఈమె భర్త కూడా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరో గానే కాదు.. విలన్ గాను ప్రేక్షకులను మెప్పించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సర్లెండి మేమే చెప్పేస్తాం. ఈమె హీరోయిన్ సయోష సైగల్. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. తెలుగుతో పాటు హిందీలోను, తమిళ్ లోను న‌టించి ఆకట్టుకుంది.

తెలుగులో ఫస్ట్ మూవీ అఖిల్. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడంతో.. స్టార్ హీరోయిన్గా మంచి అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే అమ్మడి నటనకు మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక సయోషకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత తమిళ్‌లో ఎన్నో అవకాశాలను దక్కించుకున్న సయోష.. స్టార్ హీరో ఆర్యను 2019లో ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప కూడా ఉంది. ఇక తాజాగా సినిమాల్లోకి రిఎంట్రీ ఇచ్చిన సయోష సోషల్ మీడియాలను యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.