యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రెండు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు దాదాపు రూ.2000 కోట్ల గ్రాస్ వశూళను కొల్లగొట్టాయి. బాహుబలి తర్వాత ఈ రేంజ్‌లో హిట్ కొట్టడానికి ప్రభాస్ చాలా సమయం తీసుకున్నారు. సలార్, కల్కి సినిమాలతో ప్రస్తుతం ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ గా తన సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాల్లో చాలామందినే మోసం చేశాడంటూ ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. బయట చాలా మంచి వ్యక్తి అయినా సినిమాల్లో మాత్రం ప్రభాస్ ఎంతోమందిని మోసగించాడట. ఆయనొక పెద్ద మోసగాడు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటే అలా చేయక తప్పదు.
ఇక తాజాగా బన్నీ పుష్పా సినిమాలో రెడ్ శాండిల్ స్మాగ్లార్గా కనిపించారు. ఒక క్యారెక్టర్ కోసమే అతను హీరో అయినా కూడా.. చేయకూడని పనులు చేశారు. అలాగే కొందరు దర్శకులు ప్రభాస్ కోసం డిజైన్ చేసిన పాత్రల కోసం తన రోల్ లో అతను చాలా మందిని చీట్ చేయాల్సిన సందర్భాలు వచ్చాయి. డైరెక్టర్లు రాసిన ఆ క్యారెక్టర్ల వల్ల ప్రభాస్ సినిమాల్లో ఎవరో ఒకరిని తప్పక చిట్ చేయాల్సిందే. అలా సినిమాల్లో ప్రభాస్ పెద్ద మోసగాడంటూ ఫన్నీ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన సినిమాల ద్వారా మోసం చేసిన వారి లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
మిర్చి సినిమాలో సెకండ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయను ప్రేమిస్తున్నట్లు మోసం చేసి చివరకు అనుష్కను వివాహం చేసుకుంటాడు. ఇక మిస్టర్ యచ్చన్ సినిమాలో.. కాజల్ కోసం తాప్సికి హ్యాండ్ ఇచ్చాడు. రెబల్ సినిమాలో తమన్నా, సాహో సినిమాలో శ్రద్ధా కపూర్, బిల్లా సినిమాలో నమిత.. ఇలా వీరిని లవ్ చేసినట్లు మోసం చేసి చివరకు వేరే హీరోయిన్ ను చూసుకున్నాడు. అలానే బుజ్జిగాడు మూవీలో కోట శ్రీనివాసరావును, పౌర్ణమిలో సింధుని, డార్లింగ్ లో విలన్‌ను, రాధేశ్యాంలో శాషా చైత్రన్ని.. బాహుబలి సినిమాలో అనుష్కను.. ఇలా ఒక్కొక్క సినిమాలో డిఫరెంట్ రీజన్స్ తో వీరందరినీ మోసం చేశాడు. ప్రభాస్ ఇవన్నీ కూడా స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్ల చేసిన రూల్స్ అని అందరికీ తెలిసిందే. కేవలం ఈ చీటింగ్సట్ అ న్నీ సినిమాలో పాత్రల కోసమే.. సరదాగా అనిపిస్తూ ఉంటాయి.