మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్లాప్స్.. డిజాస్టర్ అనేవి సాధారణమే. కానీ సినిమాలకు మరీ చెత్త టాక్ వచ్చిన కూడా.. వీకెండ్ వర్క్ అయితే హౌస్ ఫుల్ గా కొనసాగుతుంది. బయర్స్‌కు దాదాపు 50% రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ.. కొన్ని సినిమాలు మాత్రం ఫస్ట్ రోజు నుంచి ఘోరమైన వసూళ్ళు రాబట్టడం.. తర్వాత నుంచి అసలు థియేటర్స్ ఫుల్ ఖాళీ అయిపోవడంతో.. 70 శాతానికి పైగా నష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో తాజాగా వచ్చిన మిస్టర్ బచ్చన్ ఒకటిగా నిలిచిపోయింది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజై.. ఫస్ట్ డేనే ఫ్లాప్ టాక్ రావడంతో డీల పడిపోయింది.
డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో.. ఒకరోజు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షో ఉన్న రిలీజ్ చేశారు. అయితే డిజాస్టర్ టాక్ రావడంతో ఫస్ట్ డేనే సినిమా డిమ్యాండ్ పడిపోయింది. ఫలితంగా ఆరు కోట్ల రూపాయల షేర్ అయినా కచ్చితంగా రాబట్టాల్సిన సినిమా.. కేవలం రూ.5 కోట్ల లోపు షేర్ తో ఆగిపోయింది. అయితే ట్రేడ్ వర్గాలకు అత్యంత షాక్ ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తాజాగా మురారి సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొదటి రోజు ఈ సినిమాకు రూ.5 కోట్ల 30 లక్షలు గ్రాస్ వచ్చింది.
కాగా ఈ సినిమా వసూళ్లను మిస్టర్ బచ్చన్ రెండవ రోజు నుంచి కనీసం టచ్ కూడా చేయలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రెండవ రోజు మురారి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి కోటి రూపాయల గ్రాస్ పైగా కొల్లగొడితే.. మిస్టర్ బచ్చన్ కు రెండవ రోజు రూ.80 లక్షలు మాత్రమే షేర్ వసూళ్ళు వచ్చాయి. దీన్ని బట్టి సినిమా ఎంత డిజాస్టరో అర్థమవుతుంది. రిలీజ్ లో ఫుల్ రన్ లో రూ.10 కోట్లకు పైగా గ్రాస్వసులకు కొల్లగొట్టిన మురారి సినిమాకు.. రవితేజ మిస్టర్ బచ్చన్ న్ ఫుల్ రాన్లో వచ్చిన రూ.15 కోట్ల గ్రాస్ వసుళ్ళకు మధ్య కేవలం రూ.5 కోట్లే తేడా ఉంది. ఇక తన సినిమాతో రూ100 కోట్ల గ్రాస్ వసుళను కొల్లగొట్టే సత్తా ఉన్న రవితేజ.. ప్రస్తుతం తన సినిమాను ఓ రీరిలీజ్ సినిమా వసుళ్ళతో కూడా పోటిపడలేకపోయాడంటే ఆయన అభిమానులకు ఇది ఎంత పెద్ద అవమానమో తెలుస్తుంది.